
ఈ సందర్భం గా కైఫ్ మాట్లాడుతూ... "సచిన్ కూడా ఆర్గనైజ్డ్ బ్యాటర్. సచిన్, విరాట్ ఇద్దరిలో పోలిస్తే.. కోహ్లీ బ్యాటింగ్ లో లోపాలు కనిపిస్తాయి. 2014లో ఇంగ్లండ్ వెళ్లినప్పుడు ఫామ్ లో లేని కోహ్లీని ఆఫ్‌స్టంప్ బంతులు వేస్తూ ఆండర్సన్ బాగా ఇబ్బంది పెట్టిన సంగతి అందరికీ గుర్తుండే ఉంటుంది. ఆ సిరీస్ లో కోహ్లీ పూర్తిగా ప్లాప్ అయ్యాడు. అదే గిల్ టెక్నిక్ చూసినట్టైతే సచిన్ తో చాలా దగ్గర పోలికలు ఉంటాయి. ప్రస్తుత పరిస్థితుల్లో అతన్ని అవుట్ చేయడం చాలా కష్టం. గిల్ ఆట లో అసలు బలహీనతే కనిపించడం పోవడం కొసమెరుపు." అని అన్నాడు.
ఈ విషయం లో సచిన్ మార్గం లో గిల్ నడుస్తున్నాడు. టెక్నిక్, మానసిక బలం రెండూ గిల్‌కు బాగున్నాయి అని కూడా కైఫ్ వివరించాడు. డబ్ల్యూటీసీ ఫైనల్ కోసం గిల్ ప్రస్తుతం ఇంగ్లండ్ వెళ్లిన సంగతి తెలిసిందే. తన ఆటను నిరంతరం మెరుగు పరుచుకుంటున్నాడని గిల్‌ను కైఫ్ ఈ సందర్భం గా కొనియాడాడు. ఇంకా ఆయన మాట్లాడుతూ... "ఒక సంవత్సరం నుంచి గిల్‌ను నేను క్లోజ్‌గా అబ్జర్వ్ చేస్తున్నా. మ్యాచ్ మ్యాచ్‌కూ అతని ఆట మెరుగవుతోంది." అని పేర్కొన్నాడు. కాగా ఈ విషయం తెలిసిన గిల్ అభిమానులు ఖుషీ అయి పోతున్నారు.