క్రికెట్ లో ఒక్కసారి బ్యాక్ పట్టుకుని బరిలోకి దిగిన తర్వాత మైదానం నలువైపులా షాట్లు ఆడటం అనేది అంత సులభమైన విషయం కాదు. ఈ టాలెంట్ కేవలం కొంతమందికి మాత్రమే ఉంటుంది అని చెప్పాలి. ఇలా మైదానం నలు వైపులా కూడా షాట్లు ఆడుతూ మిస్టర్ 360 ప్లేయర్ గా గుర్తింపు సంపాదించుకున్న ఆటగాళ్లు ఎవరు అంటే ముందుగా అటు దక్షిణాఫ్రికా బ్యాట్స్మెన్ ఎబి డివిలియర్స్ పేరు గుర్తుకు వస్తూ ఉంటుంది. క్రికెట్ అనే పుస్తకంలో లేని షాట్లను కూడా  ఎబి డివిలియర్స్ సరికొత్తగా ప్రేక్షకులను అలరించాడు అని చెప్పాలి. ఇప్పుడు  డివిడియర్స్ రిటైర్మెంట్ ప్రకటించిన తర్వాత ఏకంగా సూర్య కుమార్ యాదవ్ వరల్డ్ క్రికెట్లో  అతని స్థానాన్ని భర్తీ చేశాడు.



 వరల్డ్ క్రికెట్లో నయా మిస్టర్ 360 ప్లేయర్గా అవతరించాడు సూర్య కుమార్ యాదవ్. సూర్య కుమార్ యాదవ్ మైదానంలో షాట్లు ఆడుతూ ఉంటే అటు ప్రేక్షకులు అందరూ కూడా మంత్ర ముగ్దలు అవుతూ ఉంటారు అని చెప్పాలి. ఎబి డివిలియర్స్,  సూర్య కుమార్ యాదవ్ లకు మించిన బ్యాటర్ మరొకరు లేరు అని క్రికెట్ ప్రేక్షకులు అందరూ కూడా భావిస్తూ ఉంటారు. కానీ ఏబీడీ, సూర్య కుమార్ యాదవ్ లను సైతం మించిపోయే బ్యాట్స్మెన్ కు సంబంధించిన వీడియో కాస్త ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ గా మారిపోయింది. సూర్య కుమార్ యాదవ్, ఏబీ డివిలియర్స్ ఇప్పటివరకు వికెట్ల ముందు మాత్రమే వినూత్నమైన షాట్లు ఆడారు.



 కానీ ఇప్పుడు మనం చెప్పుకునే బ్యాట్స్మెన్ మాత్రం వికెట్ల వెనకాల నుంచి కూడా స్కూప్ షాట్ పాడుతూ అందరినీ ముక్కున వేలేసుకునేలా చేస్తున్నాడు. బౌలర్ బంతి వేసే వరకు వెయిట్ చేసిన బ్యాటర్  ఆ తర్వాత ఒక్కసారిగా వికెట్ల వెనక్కి వెళ్లి వికెట్ కీపర్ తలపై నుంచి స్కూప్ షాట్ కొట్టాడు. అతను కొట్టిన షాట్ అందరినీ ఆశ్చర్యపరుస్తుంది. ఇదంతా ఎక్కడో కాదు మన దేశంలోనే ఒక లోకల్ మ్యాచ్లో వెలుగు లోకి వచ్చింది అని చెప్పాలి. ఇందుకు సంబంధించిన వీడియో మాత్రం సోషల్ మీడియా వేదికగా ప్రస్తుతం వైరల్ గా మారిపోయింది.

మరింత సమాచారం తెలుసుకోండి: