అయితే తన కెరియర్ను మళ్ళీ ట్రాక్ లోకి తెచ్చుకొని టీమ్ ఇండియా లోకి తిరిగి రావాలని ఆశతో పృథ్వి షా ఇప్పుడు ఇంగ్లాండ్ కౌంటింగ్ క్రికెట్ లో అడుగుపెట్టి అక్కడ ఆడుతున్నాడు. అయితే అక్కడ కూడా షా ఆరంభం అంతగా రాణించకపోవడంతో.. అరంగేట్రం మ్యాచ్లో భారీ ఇన్నింగ్స్ ఆడలేక చివరికి విచిత్రమైన రీతిలో out అయ్యాడు. ఇంగ్లాండ్ కౌంటిలలో నార్తంప్తన్ షైర్ క్లబ్లో భాగమయ్యాడు. ప్రస్తుతం ఈ జట్టు కోసం ఓడిఐ టోర్నమెంట్, టి20 బ్లాస్ట్ లో కొన్ని మ్యాచ్లు ఆడటం కోసం ఇంగ్లాండు గడ్డపై అడుగు పెట్టాడు. ఇటీవల నార్తామ్టాన్ వన్డే కప్పులో మ్యాచ్ ఆడింది. ఈ మ్యాచ్ లో షా ఇంగ్లీష్ క్రికెట్ లోకి అడుగు పెట్టాడు.
ఇక అతను ప్రాతినిధ్యం వహిస్తున్న జట్టు ముందు 279 పరుగుల లక్ష్యం ఉంది. కాగా పృథ్వి షా తన జట్టుకు ఓపెనింగ్ చేశాడు. ఆరంభం నుంచి నార్థాంప్థన్ వికెట్లు పడటం ప్రారంభించిన.. మరో ఎండ్ లో పృథ్వి షా నిలదొక్కుకున్నట్లుగానే కనిపించాడు. అంతలోనే అతని వికెట్ అద్భుతమైన బంతికి పడిపోయింది. నెదర్లాండ్స్ బౌలర్ పాల్ వాల్ 16 ఓవర్లో బౌన్సర్ వేశాడు. దానిని షా కొట్టేందుకు ప్రయత్నించాడు. కానీ ఫలితం లేకపోవడంతోక్రీజు లో పడిపోయాడు. ఈ క్రమంలో కాలు వికెట్లకి తగిలింది. బేయిల్స్ కింద పడిపోయాయి. దీంతో షా ఇన్నింగ్స్ ముగిసింది. అంతకుముందు ప్రాక్టీస్ లో మాత్రం అతను తెగ అదరగొట్టాడు అని చెప్పాలి.
క్లిక్ చేసి ఇండియాహెరాల్డ్ వాట్సాప్ చానెల్·ను ఫాలో అవ్వండి