టి20 ఫార్మాట్ అంటేనే బ్యాట్స్మెన్ల విధ్వంసానికి మారుపేరు అన్న విషయం తెలిసిందే. ఈ క్రమంలోనే ఎంతోమంది ఆటగాళ్లు ఇక క్రీజ్ లోకి రావడం రావడమే సిక్సర్లు పోర్లతో విరుచుకుపడుతూ ఉంటారు. ఏకంగా ఆ బౌలర్లకు చుక్కలు చూపిస్తూ ఉంటారు. ఇక ఇటీవల కాలంలో ఇలా టి20 ఫార్మాట్లో ఛాన్స్ దక్కించుకుంటున్న ఎంతోమంది టీమ్ ఇండియా యంగ్ ప్లేయర్స్ బ్యాటింగ్ విధ్వంసం అంటే ఎలా ఉంటుందో చూపిస్తూ ప్రేక్షకులకు అదిరిపోయే ఎంటర్టైన్మెంట్ పంచుతున్నారు అన్న విషయం తెలిసిందే. అయితే భారత యంగ్ ప్లేయర్స్ అందరూ కూడా ప్రస్తుతం ఆసియా గేమ్స్ లో భాగంగా వరుస మ్యాచ్ లు ఆడుతూ బిజీగా ఉన్నారు.


 ఇకపోతే ఇటీవల ఆసియా గేమ్స్ లో భాగంగా నేపాల్ తో జరిగిన మ్యాచ్లో యంగ్ సెన్సేషన్ యశస్వి జైస్వాల్ ఏ భారత ఆటగాడు సాధించలేని అరుదైన రికార్డును తన ఖాతాలో వేసుకున్నాడు. తన తొలి టి20 ఇంటర్నేషనల్ మ్యాచ్లో 49 బంతుల్లో ఎనిమిది ఫోర్లు 7 సిక్సర్లతో సెంచరీ నమోదు చేశాడు. ఇక దీంతో అంతర్జాతీయ టి20లలో భారత్ తరఫున సెంచరీ చేసిన అతిపిన్న వయస్కుడిగా అరుదైన రికార్డు సృష్టించాడు. దీంతో శుభమన్ గిల్ సాధించిన రికార్డును బద్దలు కొట్టాడు. ఈ ఏడాది న్యూజిలాండ్తో జరిగిన మ్యాచ్ లో టి20 గిల్ తొలి సెంచరీ చేయగా.. ఆ సమయంలో గిల్ వయసు 23 సంవత్సరాల 146 రోజులు మాత్రమే. ఇక ఇటీవల సెంచరీ చేసిన యశస్వి జైష్వాల్ వయస్సు 21 సంవత్సరాల 279 రోజులు మాత్రమే.


 ఇలా భారత జట్టు తరుపున సెంచరీ చేసిన అతిపిన్న వయస్కుడిగా అరుదైన రికార్డును సృష్టించాడు. ఇక మ్యాచ్ విషయానికి వస్తే.. టాస్ గెలిచిన భారత జట్టు మొదట బ్యాటింగ్ చేసి 213 పరుగుల భారీ లక్ష్యాన్ని నేపాల్ ముందు ఉంచింది. అనంతరం భారీ లక్ష్యంతో బరిలోకి దిగిన నేపాల్ జట్టు ఆరంభం నుంచి ఆచితూచి ఆడుతూ వచ్చింది. అయితే భారత బౌలర్ల దాటికి తట్టుకోలేక వరుసగా వికెట్లు కోల్పోయింది. చివరి వరకు పోరాడినప్పటికీ 23 పరుగులు తేడాతో భారత్ చేతిలో నేపాల్ ఓటమి చవిచూసింది.

మరింత సమాచారం తెలుసుకోండి: