
ఇకపోతే నెదర్లాండ్స్ తో వార్మప్ మ్యాచ్‌కు ముందు టీమ్ఇండియా ఆటగాళ్లు గ్రీన్ ఫీల్డ్ మైదానంలో ప్రాక్టీస్ చేసిన సంగతి మీరు వినే వుంటారు. ఆ పక్కనే ఉన్న గోడపై శాంసన్ పెయింటింగ్ వుండడం మనం ఇక్కడ గమనించవచ్చు. కాగా ఈ ఫోటోను సంజు శాంసన్ తన ఇన్‌స్టాగ్రామ్‌లో షేర్ చేశాడు. గాడ్స్ ఓన్ కంట్రీలో టీమ్ఇండియాతో నేను అంటూ క్యాప్షన్ ఇచ్చాడు. కాగా.. కేరళను దేవుని స్వంత దేశం అని పిలుస్తారు అన్న సంగతి అందరికీ తెలిసిందే. ఈ ఫోటో ప్రస్తుతం వైరల్‌గా మారింది.
కాగా దీనిపై సంజు అభిమానులు విచారం వ్యక్తం చేస్తుండడం కొసమెరుపు. వారి అలకకు కారణం ఏమిటంటే శాంసన్‌కు సరైన అవకాశాలు ఇవ్వడం లేదని కామెంట్లు చేస్తున్నారు. తగ సంవత్సరం డిసెంబర్‌లో వికెట్ కీపర్ రిషబ్ పంత్ రోడ్డు ప్రమాదంలో గాయపడడంతో సంజు శాంసన్‌కు అవకాశాలు వస్తాయని అంతా అనుకున్నారు. అంతేకాకుండా కేఎల్ రాహుల్ కూడా గాయపడడంతో వన్డే ప్రపంచకప్‌లో శాంసన్‌కు ప్లేస్ గ్యారెంటీ అని ఆశపడ్డారు. అయితే.. కేఎల్ రాహుల్ కోలుకుని రావడంతో సంజును టోర్నమెంట్ ముగియకముందే ఇంటికి పంపిచారు. అదేవిధంగా వన్డే ప్రపంచకప్‌లోనూ అతడికి అవకాశం రాలేదు. ఈ కారణాలే ఇపుడు అభిమానులకు జీర్ణం కావడం లేదు.