ఈ వరల్డ్ కప్ లో అతను ఆడుతుంది మొదటి ఐసిసి టోర్నీ. అయినప్పటికీ ఎక్కడ ఒత్తిడి లేకుండా పరుగుల వరద పారిస్తూ ఉన్నాడు అని చెప్పాలి. ఈ మెగా టోర్నీలో అత్యధిక పరుగులు చేసిన వారిలో టాప్ 3 లో కొనసాగుతూ ఉన్నాడు రచిన్ రవీంద్ర ఇప్పుడు వరకు ఏకంగా మూడు సెంచరీలు, రెండు హాఫ్ సెంచరీలతో అదరగొట్టాడు అని చెప్పాలి న్యూజిలాండ్ జట్టు విజయంలో కీలక పాత్ర వహిస్తూ ఉన్నాడు. అయితే రచిన్ రవీంద్ర పేరు గురించి గత కొంతకాలం నుంచి ఒక ప్రచారం తెగ వైరల్ గా మారిపోయింది.
రచిన్ రవీంద్ర కుటుంబం భారత సంతతికి చెందినవారు కావడంతో ఇక భారత క్రికెట్ లెజెండ్స్ అయినా రాహుల్ ద్రవిడ్, సచిన్ టెండూల్కర్ పేర్లు కలిసి వచ్చేలా ఇక తమ కొడుక్కి రచిన్ అనే పేరు పెట్టారు అంటూ ఒక ప్రచారం హాట్ టాపిక్ గా మారింది. అయితే ఇదే విషయం గురించి ఇటీవల రచిన్ తండ్రి స్పందిస్తూ ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. రాహుల్ ద్రావిడ్, సచిన్ టెండూల్కర్ పేర్లను కలిపి తన కొడుకుకు రచిన్ అనే పేరు పెట్టారు అనే ప్రచారంలో నిజం లేదు అంటూ అతని తండ్రి కృష్ణమూర్తి స్పష్టం చేశారు. తను పుట్టినప్పుడు రచిన్ అనే పేరును నా భార్య ప్రతిపాదిస్తే బాగుంది అని పెట్టేశాం. ఆ తర్వాత రాహుల్, సచిన్ పేర్లు కలిసి ఉన్నాయని గుర్తించాం అంటూ కృష్ణమూర్తి చెప్పుకొచ్చారు.
క్లిక్ చేసి ఇండియాహెరాల్డ్ వాట్సాప్ చానెల్·ను ఫాలో అవ్వండి