కేజిఎఫ్ హీరో యష్ గురించి సినీ ప్రేక్షకులకు కొత్తగా పరిచయం చేస్తే అది అతిశయోక్తి అవుతుంది. ఎందుకంటే కేజీఎఫ్ అనే సినిమాతో అప్పటివరకు కేవలం కోలీవుడ్ లో మాత్రమే అందరికీ తెలిసిన హీరోగా ఉన్న యష్.. ఇక భాషతో సంబంధం లేకుండా అందరికీ సుపరిచితుడుగా మారిపోయాడు అని చెప్పాలి. ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ మూవీ ఎంతటి సెన్సేషన్ విజయాన్ని సాధించిందో ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ఇక కేజిఎఫ్ బాక్స్ ఆఫీస్ షేక్ చేసింది అనుకుంటే.. ఈ సినిమాకు కొనసాగింపుగా వచ్చిన కేజిఎఫ్ 2 ఇండస్ట్రీ రికార్డులను తిరగ రాసింది అని చెప్పాలి.


 అయితే ఇలాంటి సెన్సేషనల్ హిట్ తర్వాత పాన్ ఇండియా హీరోగా మారిపోయాడు. ఈ క్రమంలోనే యష్ తర్వాత సినిమా ఎలా ఉండబోతుంది అనే దానిపై అందరిలో ఆసక్తి నెలకొంది అని చెప్పాలి. అతని నెక్స్ట్ ప్రాజెక్టుకు సంబంధించిన అనౌన్స్మెంట్ ఎప్పుడెప్పుడు వస్తుందా అని అభిమానులు అందరూ కూడా ఎంతో ఆతృతగా ఎదురు చూస్తున్నారు. అయితే దాదాపు ఏడాది పాటు తన తర్వాత సినిమా విషయంలో సైలెంట్ గానే ఉండిపోయాడు. అభిమానులనూ  మెప్పించేందుకు సరైన సినిమా వస్తేనే చేయాలని నిర్ణయించుకున్నాడు. ఎట్టకేలకు ఇప్పుడు సైలెన్స్ కు బ్రేక్ చేస్తూ అభిమానులకు ఒక అనౌన్స్మెంట్ ఇవ్వబోతున్నాడట హీరో యష్.


 కేవిఎన్ ప్రొడక్షన్స్ తో కలిపి సినిమా చేయడానికి యష్ సిద్దమయ్యాడట. ఈనెల 8వ తేదీన ఉదయం 9: 50 గంటలకు ఇక ఈ సినిమాకు సంబంధించిన డీటెయిల్స్ ప్రకటించబోతున్నారు అన్నది తెలుస్తోంది. కే జి ఎఫ్ సినిమాలో రాఖీ బాయ్ గా యష్ అదరగొట్టడంతో అతనిపై పాన్ ఇండియా లెవెల్ లో యాక్షన్ ఇమేజ్ పడిపోయింది. ఈ క్రమంలోనే తన నెక్స్ట్ సినిమాకు యాక్షన్ స్టోరీ నే సెలెక్ట్ చేసుకున్నాడా లేదంటే మరో జానర్ ట్రై చేయబోతున్నాడ అన్నది చాలామందిలో ఉత్కంఠ ఉంది. ఈ ఉత్కంఠకు తెరపడాలి అంటే అటు చిత్రబృందం నుంచి క్లారిటీ రావాల్సిందే.

మరింత సమాచారం తెలుసుకోండి: