అయితే గత కొంతకాలం నుంచి ఇలా ఐపిఎల్ వేలంలో తెలుగు క్రికెటర్లది హవా ఎక్కువగా నడుస్తూ ఉంది. ఒకప్పుడు ఆటోవాలా కొడుకు అయినా మహమ్మద్ సిరాజ్ వేలంలో భారీ ధర పలకడంతో వార్తలో హాట్ టాపిక్ మారిపోయాడు. ఇక గతంలో జరిగిన మెగా వేలంలో తెలుగు క్రికెటర్ తిలక్ వర్మ ఛాంపియన్ టీమ్ ముంబై ఇండియన్స్ జట్టులోకి వచ్చాడు. వీళ్ళు మాత్రమే కాకుండా మరి కొంతమంది క్రికెటర్లు కూడా ఐపీఎల్లో ఛాన్సులు దక్కించుకుంటున్నారు. అయితే ఇక ఇప్పుడు మినీ వేలం జరుగుతున్న నేపథ్యంలో ఈ వేలంలో ఎంతమంది తెలుగు క్రికెటర్లు పాల్గొనబోతున్నారు అన్నది హాట్ టాపిక్ గా మారింది.
ఆ వివరాలు చూసుకుంటే.. మొత్తంగా 13 మంది తెలుగు ప్లేయర్లు నేడు జరగబోయే ఐపీఎల్ వేలంలో తమ అదృష్టాన్ని పరీక్షించుకోబోతున్నారు అన్నది తెలుస్తుంది. మొత్తంగా ఈ వేలంలో 333 మంది ఆటగాళ్లు పాల్గొంటున్నారు. నేడు జరగబోయే వేలంలో అదృష్టాన్ని పరీక్షించుకుంటున్న తెలుగు క్రికెటర్లలో హనుమ విహారి, కె.ఎస్ భరత్, రికీ బోయ్, పృథ్వీరాజ్ ఎర్ర, రవితేజ, మనీష్ రెడ్డి, మురుగన్ అభిషేక్, ఆరవెల్లి అవనీష్ రావు, తనయ్ త్యాగరాజన్, రక్షన్ రెడ్డి, రాహుల్ బుద్ధి, రోహిత్ నాయుడు, అనికేత్ రెడ్డి ఇక ఈ వేలంలో పాల్గొంటున్న తెలుగు క్రికెటర్లుగా నిలిచారు.
క్లిక్ చేసి ఇండియాహెరాల్డ్ వాట్సాప్ చానెల్·ను ఫాలో అవ్వండి