సాధారణంగా ఐపీఎల్ లో ఎంతోమంది ఆటగాళ్ళు ప్రతి ఏడాది ఒక జట్టు నుంచి మరో జట్టులోకి మారిపోవడం చేస్తూ ఉంటారు అనే విషయం తెలిసిందే. ఏకంగా ఐపీఎల్ ప్రారంభానికి ముందు బీసీసీఐ మినీ వేలం నిర్వహిస్తూ ఉంటుంది. ఇక ఈ మినీ వేలంలో కొన్ని జట్లు వారు వద్దనుకున్న ఆటగాళ్ళని వేలంలోకి వదిలేస్తే.. ఇక ఆయా ఆటగాళ్లని ఇతర చెట్లు కొనుగోలు చేయడం లాంటివి చేస్తూ ఉంటాయ్. ఇలా జట్టులో ఉన్న ఆటగాళ్లు ఒక టీమ్ నుంచి మరో టీం లోకి మారుతూ  ఉంటారు అని చెప్పాలి.


 అయితే కొంతమంది ఆటగాళ్లు మాత్రం ఎన్నో ఏళ్ల నుంచి ఒకే జట్టుకు ప్రాతినిథ్యం వహిస్తూ ఉంటారు. కానీ అలాంటి ప్లేయర్లను కూడా కొన్ని కొన్ని సార్లు ఫ్రాంచైజీలు వదిలేసేందుకు వెనకడుగు వేస్తాయి అన్న విషయం తెలిసిందే. గతంలో చాహల్ విషయంలో కూడా ఇలాంటిదే చేసింది రాయల్ చాలెంజర్స్ బెంగళూరు జట్టు. కోహ్లీ కెప్టెన్సీలో ఇక రాయల్ చాలెంజర్స్ బెంగళూరు జట్టులో కీలక ఆటగాడిగా కొనసాగాడు చాహల్. ప్రతి సీజన్లో కూడా తన ప్రదర్శనతో ఆకట్టుకున్నాడు. జట్టు విజయాలలో కీలకపాత్ర వహించాడు అని చెప్పాలి.


 ఇలా ఆర్సిబి జట్టులో అత్యంత కీలకంగా వ్యవహరించిన చాహల్ ను ఆ జట్టు ఏకంగా వేలంలోకి వదిలేయడంతో అభిమానులు కూడా షాక్ అయ్యారు. అయితే ఆ సమయంలో జరిగిన విషయాలను అప్పుడు కోచ్ గా ఉన్న మైక్ హాసన్ వివరించారు. 2022 ఐపీఎల్ కు ముందు అతడిని టీం వేలంలోకి వదిలేసింది. వేలం జరగడానికి ముందు చాహల్ ను ఎందుకు వదిలేయాల్సి వచ్చిందో.. వేలం సమీకరణాలు ఏంటో అతనికి చెప్పేందుకు ప్రయత్నించాను. కానీ అప్పటికే అతను బాధలో ఉన్నాడు. నా మాట వినే పరిస్థితిలో లేడు. తిరిగి అతన్ని వేలంలో కొనుగోలు చేయాలని అనుకున్నాం. కానీ మాకు కుదరలేదు అంటూ మైక్ హసన్ చెప్పుకొచ్చాడు.

మరింత సమాచారం తెలుసుకోండి: