సాధారణంగా క్రికెట్లో ఎన్నో ఏళ్ల పాటు ఆటగాళ్లుగా సేవలు అందించిన ప్లేయర్లు ఇక రిటైర్మెంట్ ప్రకటించిన తర్వాత కూడా అటు క్రికెట్ కి ఏదో ఒక విధంగా దగ్గరగా ఉండడానికి ప్రయత్నాలు చేస్తూ ఉంటారు అన్న విషయం తెలిసిందే. ఈ క్రమంలోనే కొంతమంది ఏకంగా కోచ్ గా అవతారం ఎత్తి తమ అనుభవంతో యువ ఆటగాళ్ల ప్రతిభను మెరుగుపరిచేందుకు ప్రయత్నిస్తే.. ఇంకొంతమంది ఇక వ్యాఖ్యతలుగా మారిపోయి తమ గాత్రంతో క్రికెట్ మ్యాచ్లను ఉత్కంఠ గా మార్చేందుకు ప్రయత్నిస్తూ ఉంటారు.


 ఇలా ఇప్పటివరకు ఎంతోమంది మాజీ క్రికెటర్లు కోచ్ లుగా లేదా వ్యాఖ్యాతలుగా వ్యవహరించిన వారు ఉన్నారు అని చెప్పాలి. కానీ ఈ మధ్యకాలంలో మాత్రం మాజీ క్రికెటర్లు అందరూ కూడా ఇక ఇందుకు భిన్నంగా వ్యవహరిస్తూ ఉన్నారు  ఏకంగా క్రికెట్కు ఎక్కడా సంబంధంలేని పాలిటిక్స్ వైపు అడుగులు వేస్తూ ఉన్నారు అన్న విషయం తెలిసిందే. ఇప్పటికే అటు భారత మాజీ క్రికెటర్ గౌతమ్ గంభీర్ బిజెపి తరఫున గత ఎంపీ ఎలక్షన్లలో పోటీ చేసి విజయం సాధించారు. అయితే మరికొన్ని రోజుల్లో పార్లమెంటు ఎన్నికలు జరగబోతున్న నేపథ్యంలో.. ఇక ఈసారి మరో మాజీ క్రికెటర్ కూడా ఇలాగే ఎన్నికల్లో పోటీ చేయడానికి సిద్ధమవుతున్నాడు అంటూ వార్తలు వస్తున్నాయి.


 ఆ మాజీ క్రికెటర్ ఎవరో కాదు యువరాజ్ సింగ్. ఏకంగా పార్లమెంటు ఎన్నికల్లో బిజెపి తరఫున ఎంపీగా పోటీ చేస్తున్నట్లు వార్తలు రాగా.. ఈ విషయంపై ఆయన స్వయంగా స్పందించారు. నేను పంజాబ్ లోని గురుదాస్పూర్ నుంచి పోటీ చేయడం లేదు. ప్రజలకు  సేవ చేయడం పైన నాకు ఆసక్తి ఉంది. అయితే youwecan అనే ఫౌండేషన్ ద్వారా సేవను కొనసాగిస్తాను అంటూ యువరాజ్ సింగ్ చెప్పుకొచ్చాడు.  అయితే ఇటీవల యువరాజ్ తన తల్లి శబ్నమ్ తో కలిసి కేంద్ర మంత్రి నితిన్ గడ్కరిని కలవడంతో ఇక యువరాజ్ పొలిటికల్ ఎంట్రీ పై వార్తలు వచ్చాయి. కానీ ఇప్పుడు ఈ మాజీ ప్లేయర్ క్లారిటీ ఇవ్వడంతో ఇక ఈ వార్తలకి పుల్ స్టాప్ పడిపోతుంది అని చెప్పాలి.

మరింత సమాచారం తెలుసుకోండి: