టీమిండియా స్టార్ ప్లేయర్ యుజువేంద్ర చాహల్ గురించి కొత్తగా పరిచయం అక్కర్లేదు. ఎందుకంటే  దశాబ్ద కాలం నుంచి టీం ఇండియా తరఫున ప్రాతినిధ్యం వహిస్తున్న ఈ ఆటగాడు ఎప్పుడు జట్టులో కీలక ఆటగాడిగా కొనసాగుతూ ఉంటాడు. అద్భుతమైన ఆట తీరుతో ఆకట్టుకుంటూ ఉంటాడు. మరి ముఖ్యంగా ఎంతో మంది క్రికెట్ విశ్లేషకులు చాహాల్ ను తెలివైన బౌలర్ అని కూడా అభివర్ణిస్తూ ఉంటారు. ఎందుకంటే ఏ బ్యాట్స్మెన్కు ఎక్కడ బంతి వేస్తే వికెట్ దక్కుతుంది అనే విషయం అతనికి బాగా తెలుసు.


 సిక్సర్లు ఫోర్లతో చలరేగిపోతున్న బ్యాట్స్మెన్లను సైతం ఇక అద్భుతమైన బంతులతో పెవిలియన్  పంపించగల సత్తా చాహాల్ సొంతం అని చెప్పాలి. అయితే గతంలో ఐపీఎల్ రాయల్ చాలెంజర్స్ బెంగుళూరు జట్టు తరపున కొనసాగిన చాహల్ ఇక ఇప్పుడు రాజస్థాన్ రాయల్స్ జట్టు తరఫున ప్రాతినిధ్యం వహిస్తున్నాడు. అయితే ఇక ఇప్పుడు రాజస్థాన్ జట్టు విజయాలలో కీలకపాత్ర వహిస్తూ ఉన్నాడు అని చెప్పాలి. కాగా చాహాల్ ను గత కొన్ని మ్యాచ్ల నుంచి ఒక అరుదైన రికార్డు ఊరిస్తుంది.


 అదే ఐపీఎల్లో 200 వికెట్ల మార్క్. ఇప్పటివరకు ఏ ఒక్క బౌలర్ కూడా ఐపీఎల్ హిస్టరీలో 200 వికెట్లు తీయలేదు. కానీ చాహల్ మాత్రం ఇటీవల ఈ అరుదైన రికార్డును సృష్టించాడు. 200 వికెట్లు తీసిన తొలి బౌలర్గా నిలిచాడు. ముంబై ఇండియన్స్ తో జరుగుతున్న మ్యాచ్లో ఈ మైలురాయిని అందుకున్నాడు. ఈ టోర్నమెంట్లో ఇప్పటివరకు 153 మ్యాచ్లు ఆడిన చాహల్ ఇలా 200 వికెట్స్ మైలురాయిణి అందుకోవడం గమనార్హం. అయితే గతంలో ఆర్సిబి తరఫున మాత్రమే కాదు ముంబై ఇండియన్స్ తరఫున కూడా ప్రాతినిధ్యం వహించాడు. ఇకపోతే చాహల్ ప్రాతినిత్యం వహిస్తున్న రాజస్థాన్ రాయల్స్ జట్టు ఎంత అద్భుతంగా రాణిస్తున్న ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు ఇప్పటివరకు ఎనిమిది మ్యాచ్లలో ఏడింటిలో విజయం సాధించింది.

మరింత సమాచారం తెలుసుకోండి: