జూన్ నెలలో ప్రారంభం కాబోయే టి20 వరల్డ్ కప్ పై ఇక ప్రపంచ క్రికెట్ ప్రేక్షకులు అందరూ కూడా భారీ గానే అంచనాలు పెట్టుకున్నారు. తమ అభిమాన జట్టు తప్పకుండా టైటిల్ విజేతగా నిలుస్తుందని.. విశ్వవిజేతగా అవతరిస్తుందని అనుకుంటున్నారు. అయితే ఇప్పటికే ఆయా దేశాల క్రికెట్ బోర్డులు కూడా t20 వరల్డ్ కప్ ను దృష్టిలో పెట్టుకొని జట్టు ఎంపిక విషయంలో ఎంతో వ్యూహాత్మకంగానే అడుగులు వేస్తూ ఉన్నాయి.


 అత్యుత్తమ జట్టుతో బరిలోకి దిగేందుకు ఇక ప్రణాళికలను సిద్ధం చేసుకునే పనిలో బిజీబిజీగా ఉన్నాయి అని చెప్పాలి. అయితే గత కొంతకాలం నుంచి వరల్డ్ కప్ టైటిల్ గెలవడంలో కాస్త వెనకబడిపోయిన భారత జట్టు.. ఇక ఈ టి20 వరల్డ్ కప్ ను మాత్రం తప్పక విజయం సాధించాలని అనుకుంటుంది. ఈ క్రమంలోనే ప్రస్తుతం జరుగుతున్న ఐపీఎల్లో బాగా రాణించిన ఆటగాళ్లకు టి20 వరల్డ్ కప్ లో చోటు దక్కే అవకాశం ఉంది  అయితే బిసిసిఐ టి20 వరల్డ్ కప్ జట్టును ప్రకటించక ముందే తమ అభిప్రాయం ప్రకారం టి20 వరల్డ్ కప్ టీమ్ ఏంటీ అన్న విషయాన్ని ప్రకటిస్తున్నారు.


 ఈ క్రమంలోనే ఆయా మాజీ ఆటగాళ్లు ఇలా ప్రకటిస్తున్న టి20 వరల్డ్ కప్ టీమ్స్ సోషల్ మీడియాలో వైరల్ గా మారిపోతున్నాయి  ఇప్పటికే పలువురూ ఆటగాళ్లు ఇలా వరల్డ్ కప్ ప్రకటించగా ఇటీవల టీమిండియా మాజీ ప్లేయర్ ఇర్ఫాన్ పటాన్ సైతం తన వరల్డ్ కప్ జట్టును ప్రకటించాడు. ఐపీఎల్ లో అదరగొడుతున్న ప్లేయర్లను దృష్టిలో పెట్టుకొని ఇక ఈ టీం ఎంపిక చేసినట్లు తెలుస్తోంది. రోహిత్ శర్మ కెప్టెన్ గా ఉండగా జైష్వాల్, విరాట్ కోహ్లీ, సూర్యకుమార్, పంత్, దూబే, హార్దిక్ పాండ్యా, రింకు సింగ్, జడేజా, కుల్దీప్ యాదవ్, బుమ్రా, అర్షదీప్ సింగ్, సిరాజ్, బిష్ణయ్ లేదా చాహల్.. గిల్ లేదా సంజూ లను తన టి20 వరల్డ్ కప్ జట్టులోకి ఎంపిక చేశాడు ఇర్ఫాన్ పఠాన్.

మరింత సమాచారం తెలుసుకోండి: