
సచిన్ కొడుకు కాబట్టి నిరంతరం ఏదో ఒక వార్తలలో పేరు వినిపిస్తూ ఉంటుంది. అయితే ఇప్పుడు తాజాగా అర్జెంట్ టెండూల్కర్ త్వరలోనే పెళ్లి చేసుకోబోతున్నారనే విధంగా వినిపిస్తున్నాయి. తాజాగా అతని నిశ్చితార్థం కూడా జరిగిపోయిందనే విధంగా వినిపిస్తున్నాయి. ముంబైకి చెందిన ఒక బడా పారిశ్రామికవేత్త రవి ఘాయ్ మనవరాలు అయిన సానియా చందోక్ తో అర్జున్ ఎంగేజ్మెంట్ జరిగిందని త్వరలోనే వీరి వివాహం ఇద్దరు కుటుంబ సభ్యులు చేయబోతున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి.
సానియా కుటుంబ ముంబైలోని చాలా పేరున్న బడ వ్యాపార కుటుంబంగా పేరుపొందింది.. పలు రకాల హోటల్స్ తో పాటుగా బ్రూక్లిన్ క్రీమరి ఐస్ క్రీమ్ వ్యాపారం కూడా ఉన్నది. అయితే అఫీషియల్ గా మాత్రం వీరి కుటుంబ సభ్యులు ఇంకా ఈ ఎంగేజ్మెంట్ విషయంపై తెలుపలేదు. అర్జున్ టెండూల్కర్ విషయానికి వస్తే ఇప్పటివరకు 17 ఫస్ట్ క్లాస్, 18 లిఫ్ట్ -A ,24 t20 లు ఆడారు.33.51 సగటుతో 37 వికెట్లను తీశారు. 102 పరుగులు అర్జున్ టెండూల్కర్ మీద ఉన్నాయి. ముంబై టీమ్ అర్జున్ టెండూల్కర్ 30 లక్షల బేస్దరదు కొనుగోలు చేస్తోంది. లాస్ట్ సీజన్ లో కేవలం బెంచికే పరిమితమయ్యారు. మరి ముందు ముందు ఎలా రానిస్తారో చూడాలి.