గత ఆరు సంవత్సరాలుగా మా టీవిలో ప్రసారం అవుతున్న బిగ్ బాస్ షో కు తెలుగు రాష్ట్రాలలో విశేషమైన ఆదరణ ఉంది. బిగ్ బాస్ మొదటి సీజన్ నుండి ఈ రోజు వరకు ప్రతి ఎపిసోడ్ ను ఎంతగానో ఎంజాయ్ చేస్తున్నారు. సీజన్ 5 ముగియడానికి కేవలం 3 వారాలు మాత్రమే మిగిలి ఉన్నాయి. అయితే రోజు రోజుకీ టాప్ 5 లో ఎవరి ఉంటారు? అలాగే టైటిల్ గెలిచేది ఎవరు అనే విషయాలు అందరినీ ఎంతగానో టెన్షన్ పెడుతున్నాయి. ఈ రోజు జరిగే ఎలిమినేషన్ తో ఇంట్లో కేవలం 7 గురు సభ్యులు మాత్రమే మిగలనున్నారు. అందుకే అందరి దృష్టి ఈ రోజు జరిగే ఎలిమినేషన్ మీదనే ఉంది.

తెలుస్తున్న సమాచారం ప్రకారం అనూహ్యమైన ఎలిమినేషన్ జరగనుంది? టాప్ 5 లో ఖచ్చితంగా ఉంటాడు..మరియు టైటిల్ అందుకునే వారిలో ఒకడిగా ఉంటాడు అనుకున్న యాంకర్ రవి ఈ రోజు ఎలిమినేట్ కానున్నాడు అని లీక్స్ చెబుతున్నాయి. మరి ఇందులో ఎంత నిజం ఉందో తెలియాలంటే రాత్రి వరకు ఆగాల్సిందే. కాగా టైటిల్ అందుకునే సత్తా కేవలం ఇద్దరికి మాత్రమే ఉందని ఓటింగ్ ను చూస్తే అర్థమవుతుంది. వారిలో ప్రతి వారం ఓటింగ్ లో సన్నీ టాప్ లో ఉన్నాడు. కాగా యూట్యూబ్ స్టార్ షణ్ముఖ్  జస్వంత్ రెండవ స్థానంలో కొనసాగుతున్నాడు. సన్నీ తనదైన కామెడీ, పంచ్ లు, స్నేహం లాంటి అంశాలతో ప్రేక్షకులకు బాగా చేరువయ్యాడు.

షణ్ముఖ్ అయితే తన మైండ్ గేమ్ మరియు నిజాయితీ గల ఆటతీరుతో ఫ్యాన్స్ ను ఆకట్టుకున్నాడు. వీరిద్దరి మధ్య స్వల్ప తేడా మాత్రమే ఉన్నట్లు తెలుస్తోంది. నిన్న హౌస్ లోకి వచ్చిన ఇంటి సభ్యుల ఫ్రెండ్స్ కూడా దాదాపుగా వీరిద్దరినే టాప్ 2 లో పెట్టారు. టైటిల్ విన్నర్ ఎవరో తెలియాలంటే ఈ రెండు వారాలు పడే ఓట్లు కీలకం కానున్నాయి. చివరికి ఏమవుతుందో చూడాలి.

మరింత సమాచారం తెలుసుకోండి: