బిగ్ బాస్ కార్యక్రమానికి ప్రేక్షకులలో ఎంతటి ఆదరణ ఉందో అందరికి తెలిసిన విషయమే. కాగా ఈ క్రమంలోనే బిగ్ బాస్ కార్యక్రమం ఇప్పటి వరకు బుల్లితెరపైన 5 సీజన్లను విజయవంతంగా పూర్తి చేసుకుంది. అంతేకాదు ఇప్పుడు ఓటీటీలో బిగ్ బాస్ నాన్ స్టాప్ పేరుతో ప్రసారం అవుతున్న సంగతి కూడా తెలిసిందే. అయితే ఈ షో 17 మంది కంటెస్టెంట్ లతో 12 వారాల పాటు కొనసాగగా ఈ వారంతో ముగియనున్న విషయం కూడా తెలిసిందే.. కాగా ప్రస్తుతం బిగ్ బాస్ హౌస్ లో మొత్తంగా ఏడుగురు కంటెస్టెంట్లు ఉన్నారు.

వరుసగా వారు అఖిల్, అనిల్,  అరియనా, బాబా భాస్కర్, బిందు మాధవి,  శివ, మిత్రశర్మ ఉన్నారు. అయితే గతంలో బిగ్ బాస్ గ్రాండ్ ఫినాలేలో మామూలుగా ఐదు మంది కంటెస్టెంట్ మాత్రమే ఉండగా ఈ సారి మాత్రం ఏకంగా ఏడుగురు కంటెస్టెంట్ లు ఉన్నారు. మరి  వీరిలో టైటిల్‌ ఎవరు చేసుకుంటారు అనే విషయం మాత్రం ఇప్పుడు ప్రేక్షకులు అందరూ ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. కాగా ఇప్పటి వరకు బిగ్ బాస్ విన్నర్స్ లో ఒక్క లేడి కంటెస్టెంట్ కూడా లేకపోగా, ఈసారి మాత్రం బిగ్ బాస్ చరిత్రలోనే ఫస్ట్ లేడీ కంటెస్టెంట్ విన్నర్ కాబోతుందని.. అది కూడా ఆడపులి బిందు మాధవి ఈ టైటిల్ గెలుచుకోబోతుందనే ప్రచారం మాత్రం ముమ్మరంగా జరుగుతుంది.

అయితే బిగ్ బాస్ టైటిల్ రేసులో ఇప్పుడు బిందు మాధవి, అఖిల్ ఉండగా.. వీరిద్దరిలో మాత్రం ఎవరు టైటిల్ గెలుస్తారు అనే దాని మీద ఇప్పుడు పెద్ద ఎత్తున చర్చలు మొదలు పెట్టేసారు. అయితే, ఇప్పుడు గ్రాండ్ ఫినాలేకి సంబంధించిన ఎపిసోడ్ షూటింగ్ కూడా పూర్తి కావడంతో బిగ్ బాస్ టైటిల్ ను బిందుమాధవి అందుకుందనే వార్తలు పెద్ద ఎత్తున షికార్లు చేస్తున్నాయి. అంతేకాదు ఈ క్రమంలోనే సోషల్ మీడియా వేదికగా #BinduTheSensation, #BinduMadhavi అంటూ యాష్ టాగ్స్ బాగా ట్రెండ్ చేస్తున్నారు. మరి ఇది ఎంత వరకు నిజం అనేది మాత్రం  తెలియాలంటే బిగ్ బాస్ హోస్ట్ నాగార్జున అధికారికంగా ప్రకటించే వరకు వేచి చూడాల్సిందే అంటున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: