ప్రస్తుతం సోషల్ మీడియాలో ఎక్కువగా వినిపిస్తున్న పేర్లలో జబర్దస్త్ వర్ష పేరు కూడా ఒకటి. ఈ ముద్దుగుమ్మ మొదట సీరియల్స్ లో నటించి పెద్దగా గుర్తింపు రాలేకపోవడంతో బుల్లితెరపై ప్రసారమయ్యే పలు షోలలో నటిస్తూ ఉన్నది. ముఖ్యంగా జబర్దస్త్ లో ఇమ్మాన్యూయేల్ కు జంటగా కలిసి స్కిట్లు చేయడంతో బాగా పాపులర్ అయ్యారు ఈ జంట. ముఖ్యంగా వీరిద్దరి మధ్య వచ్చే డబల్ మీనింగ్ డైలాగ్స్ ప్రతి ఒక్కరిని ఆకట్టుకునేలా ఉంటాయి. ఇక వీరి మధ్య ఏమీ లేకపోయినా కూడా ఏదో ఉందని టిఆర్పి రేటింగ్ ల కోసం చూపించడంతో వీరిద్దరూ మధ్య ఏదో ఉందని విషయం బుల్లితెర ప్రేక్షకులకు హాట్ టాపిక్ గా మారింది.


ఇక అంతే కాకుండా గడిచిన రెండు రోజుల క్రితం ఇమ్మాన్యూయేల్, వర్ష కోసం ఒక హారాన్ని కూడా బహుమతిగా ఇచ్చారు. అయితే ఇదంతా కేవలం పాపులారిటీ కోసమే అన్నట్లుగా వార్తలు వినిపిస్తున్నాయి. అయితే ఈ విషయాలపై ఎప్పటికప్పుడు సోషల్ మీడియాలో వర్ష పైన ట్రోల్లింగ్ వినిపిస్తూనే ఉన్నాయి. దీంతో వర్ష,ఇమ్మాన్యూయేల్ వివాహం చేసుకోబోతున్నారనే వార్తల పై ప్రేక్షకులు సైతం వర్షన్ని గుచ్చి గుచ్చి ప్రశ్నిస్తున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి.

ఈ క్రమంలో జబర్దస్త్ ను మానేయాలని తన ఇంట్లో వాళ్ళు వర్షపై ప్రెషర్ పెడుతున్నట్లుగా సమాచారం. ఇక అంతే కాకుండా సోషల్ మీడియాలో వీరిద్దరి పైన పలు వల్గర్ గా పెడుతున్న కామెంట్లను చూసి వర్ష కూడా బాధపడినట్లు సమాచారం. దీంతో వర్షకి కూడా సంబంధాలు చూస్తున్నారు అని వార్తలు వైరల్ గా మారుతున్నాయి. ఇక అప్పుడప్పుడు వర్ష సోషల్ మీడియాలో ఫోటోషూట్ లు కూడా వైరల్ గా మారుతూ ఉంటాయి. దీంతో సోషల్ మీడియాలో ఫ్యాన్ ఫాలోయింగ్ కూడా బాగానే పెన్ చేసుకుంటుంది ఈ ముద్దుగుమ్మ. వర్ష జబర్దస్త్ వీడుతుందో లేదో చూడాలి మరి.

మరింత సమాచారం తెలుసుకోండి: