ఈటీవీలో ప్రసారమవుతున్నటువంటి జబర్దస్త్ కామెడీ షో అందరికీ సుపరిచితమే. ఈ షో మొదలు పెట్టినప్పుడు పర్మినెంట్ జడ్జిలుగా నాగబాబు, రోజా కనిపిస్తూ ఉండేవారు. కొన్నాళ్ల తర్వాత నాగబాబు వెళ్ళిపోయారు. ఆయన స్థానంలో ఎంతోమంది జడ్జిలుగా రావడం జరిగింది ఏ ఒక్కరు కూడా పర్మినెంట్ జడ్జ్ అవ్వలేకపోయారు. కానీ సింగర్ మనో ఎక్కువ కాలం మాత్రం జబర్దస్త్ జడ్జిగా కొనసాగించారు. ఇక చెన్నై నుండి రావడానికి వీరు పడడం లేదని జబర్దస్త్ కి కొత్త జడ్జిగా కృష్ణ భగవాన్ ని తీసుకువచ్చారు మల్లెమాల సంస్థ.


ఆయన కూడా కొన్ని కారణాలవల్ల ఈ షో కి దూరమయ్యే అవకాశాలు ఉన్నట్లుగా వార్తలు వినిపిస్తున్నాయి. ఈ సమయంలో జబర్దస్త్ కోసం కొత్త జడ్జిగా మరొకరు రాబోతున్నారని వార్తలు చాలా ఊపందుకుంటున్నాయి. ఈసారి రాబోతున్న కొత్త జడ్జ్ గురించి ఇండస్ట్రీలో కాస్త ఎక్కువగానే చర్చలు జరుగుతున్నాయి. ప్రముఖ కమెడియన్లలో ఒకరైన 30 ఇయర్స్ ఇండస్ట్రీ పృథ్వి గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు ఆయన ఇండస్ట్రీలోకి అడుగుపెట్టి ఇప్పటికి ఎన్నో సంవత్సరాలు అవుతున్న.. పలు వివాదాలలో చిక్కుకుంటూ ఉంటారు. ఈ మధ్యకాలం లో రాజకీయంగా కూడా ఎదగడానికి పలు ప్రయత్నాలు కూడా చేస్తున్నారు. దీంతో సినిమా అవకాశాలు కూడా భారీగానే తగ్గిపోయాయి.

వరుస సినిమాలు నటిస్తున్న సమయంలో రాజకీయాలలోకి ఎంట్రీ ఇవ్వడంతో తన కెరియర్ నాశనం చేసుకున్నారని ఏన్నో సార్లు ఆయన అభిమానులు తెలియజేయడం జరిగింది. కమెడియన్ పృద్వి ఇప్పుడు జబర్దస్త్ జడ్జిగా రాబోతున్నారు అంటూ పలు వార్తలు ప్రచారం జరుగుతున్నాయి. ఈ విషయం పై మల్లెమాల మరియు ఈటీవీ వర్గాల నుండి ఎలాంటి అధికారికంగా ప్రకటన వేలుబడలేదు. అయితే రాబోయే ఏడాదిలో కచ్చితంగా కొత్త జడ్జి మారడం పక్క అంటూ కొంతమంది మాత్రం తెలియజేస్తూ ఉన్నారు. మరి ఇలాంటి విషయంపై మల్లెమాల సంస్థ క్లారిటీ ఇస్తుందేమో చూడాలి మరి.

మరింత సమాచారం తెలుసుకోండి: