తెలుగు బుల్లితెరపై కార్తీకదీపం సీరియల్ ద్వారా మంచి పాపులారిటీ సంపాదించుకుంది నటి మోనిత. కుర్రాళ్ళ మదిలో క్రష్ గా మిగిలిపోయింది. అయితే ఇప్పుడు అటువంటి కొంతమంది కుర్రాళ్లకు ఒక షాకింగ్ న్యూస్ తెలుపుతోంది. తన పెళ్లి ప్రకటనతో ఒక్కసారిగా అందరికీ గట్టి షాక్ ఇచ్చింది. గడిచిన ఆరు సంవత్సరాలుగా బుల్లితెర పైన ఒక రేంజ్ లో సందడి చేసిన కార్తీక దీపం సీరియల్ లో నటించిన ప్రతి ఒక్కరికి కూడా మంచి ఫ్యాన్ ఫాలోయింగ్ ఏర్పడింది ఇక ఈ సీరియల్ లో విలన్ పాత్రలో నటించిన మోనిత.


క్యారెక్టర్ నెగటివ్ అయినప్పటికీ మాత్రం కుర్రకారులకు ఈమే అందానికి ఫిదా అయ్యారు. చాలా వరకు ఈమె కోసమే సీరియల్ చూసేవారు చాలామంది ఉన్నారు అయితే గడిచిన కొద్ది రోజుల క్రితం ఈ సీరియల్ ముగిసినప్పటికీ కూడా ఈమెను కుర్రకారులు మాత్రం మర్చిపోలేక పోతున్నారు. దీంతో ఇమే ప్రేక్షకులకు దూరం కాకుండా ఉండేందుకు సోషల్ మీడియా ద్వారా అభిమానులకు టచ్ లోనే ఉంది. తాజాగా తన పెళ్లికి సంబంధించి ఒక ప్రకటన విడుదల చేసి అందరికీ ఒకసారిగా షాక్ ఇవ్వడం జరుగుతోంది.


కన్నడ ప్రాంతానికి చెందిన అమ్మాయి అయినప్పటికీ కన్నడ ,తెలుగు తెరపై కూడా సీరియల్స్ లో నటించింది ఈమె అసలు పేరు శోభా శెట్టి. ఈమె కార్తీకదీపం సీరియల్ ద్వారా మంచి గుర్తింపు సంపాదించుకుంది. ఇక సీరియల్ తోనే ఈమె సోషల్ మీడియాలో మంచి ఫ్యాన్ ఫాలోయింగ్ సంపాదించుకున్నది. ఇమే పేరు మీద ఒక యూట్యూబ్ ఛానల్ కూడా క్రియేట్ చేయడం జరిగింది. ఇందులో తనకు సంబంధించిన అన్ని విషయాలను షేర్ చేస్తూ ఉంటుంది. తాజాగా ఒక యూట్యూబ్ని షేర్ చేయడం జరిగింది. ఆ వీడియోలో కుర్రాళ్లంతా ఇమే ను చూసి చాలా బాధపడుతున్నారు. ఎందుకంటే ఈమె తన వివాహం కోసం జువెలరీ షాపింగ్ చేస్తున్నట్లుగా ఈ వీడియోలో నగల డిజైన్ ను చూపిస్తూ తెలియజేసింది. అయితే ఈమె ఎవరిని వివాహం చేసుకోబోతుందని విషయాన్ని మాత్రం తెలపలేదు.

మరింత సమాచారం తెలుసుకోండి: