చిన్నారి పెళ్ళికూతురు డబ్బింగ్ సీరియల్ ద్వారా మంచి పాపులారిటీ సంపాదించుకుంది నటి ఆవికా గోర్.. అయితే ఈ ముద్దుగుమ్మ ఆ తర్వాత హీరోయిన్గా ఎంట్రీ ఇచ్చి దాదాపుగా ఎన్నో చిత్రాలలో నటించి మరింత క్రేజ్ అందుకుంది. అనంతరం హీరోయిన్ గా కూడా ప్రేక్షకులను బాగా మైమరిపించింది ఈ ముద్దుగుమ్మ. తెలుగులో మొదట ఉయ్యాల జంపాల అనే సినిమా ద్వారా హీరోయిన్గా తెలుగు తెరకు పరిచయమయ్యింది. తన మొదటి సినిమాతోనే మంచి విజయాన్ని అందుకున్న ఆవికాగోర్ ఎన్నో చిత్రాలలో హీరోయిన్గా నటించి మరింత పాపులారిటీ అందుకుంది.

అయితే మధ్యలో కొంతకాలం సడన్గా ఇండస్ట్రీకి దూరమై అందరికీ ఆశ్చర్యానికి గురిచేసింది ఈ ముద్దుగుమ్మ. ఇలా బ్రేక్ ఇవ్వడంతో తిరిగి ఇండస్ట్రీలోకి నిలదొక్కుకోవడానికి ఇప్పటికీ పలు రకాలు ప్రయత్నాలు చేస్తూనే ఉంది. ఈమెకు సినిమా అవకాశాలు రాకపోవడంతో పలు వెబ్ సిరీస్లలో నటిస్తోంది. ఇటీవలే తానే సొంతంగా ఒక సినిమాను నిర్మించిన ఆ సినిమా కూడా బెడిసి కొట్టింది. కానీ ఓంకార్ తెరకెక్కిస్తున్న ప్రతి చిత్రాలు వెబ్ సిరీస్ లలో నటిస్తూ మంచి క్రేజీ అందుకుంటోంది అవికా గోర్.


ఇటీవల మ్యాన్షన్ 24 అనే వెబ్ సిరీస్లో నటించడం జరిగింది. అలాగే ఈమె వధువు అని వెబ్ సిరీస్ లో కూడా నటించడం జరిగింది. ఇందులో ప్రమోషన్స్ లో భాగంగా ఒక ఇంటర్వ్యూలో పాల్గొన్నా అవికా గోర్ పలు విషయాలను తెలియజేయడం జరిగింది. ముఖ్యంగా తన పెళ్లి ప్రస్తావన గురించి ప్రశ్న అడగడంతో తాను ఇప్పటికే ఆన్ స్క్రీన్ పైన ఏకంగా 20 సార్లు పెళ్లి చేసుకుని ఉంటానంటూ షాకింగ్ విషయాలను తెలియజేసింది.. చిన్నారి పెళ్లికూతురు సీరియల్లో నటించేటప్పుడు తనకు పదేళ్లు అని పెళ్లికూతురు అంటే అప్పుడు తనకి ఎలా ఉండాలి ఇంట్లో ఎలా మెలగాలి అనే విషయాలు పెద్దగా తెలియదు.. అప్పటినుంచి తను పెళ్లికూతురు మేకప్ వేసుకొని వస్తూ ఉన్నారని ఇప్పటివరకు ఎన్నో సీరియల్స్ లో నటించ దాదాపుగా 20 సార్ల వరకు పెళ్లికూతురుగా ముస్తాబ్ అయ్యాను అంటూ తెలిపింది. ఇటీవలే వధువు సిరీస్ లో కూడా ఇదే పాత్రలో నటించానని తెలిపింది.

మరింత సమాచారం తెలుసుకోండి: