తెలుగు బుల్లితెరపై ప్రసారమయ్యేటువంటి సీరియల్స్ లో కార్తీక దీపం సీరియల్ కి విపరీతమైన ఫ్యాన్ ఫాలోయింగ్ ఉన్నది.. ముఖ్యంగా ఇందులో వంటలక్క డాక్టర్ బాబు పేరు తెలియని వారంటూ ఎవరూ ఉండరు. టీ ఆర్పి రేటింగ్ విషయంలో కూడా సరికొత్త ఫిట్నెస్ ని అందుకుంది.. ముఖ్యంగా వంటలక్క స్క్రీన్ ప్రజెంటేషన్ అన్ని వర్గాలను కూడా ఆకట్టుకున్నది. ఫ్యామిలీ ఆడియన్స్ కు విపరీతమైన ఫ్యాన్ ఫాలోయింగ్ ఏర్పడింది ఈ సీరియల్ కు.. దాదాపుగా 6 సంవత్సరాల పాటు ప్రేక్షకులను ఆకట్టుకున్న ఈ సీరియల్ ఇప్పుడు మళ్లీ సీక్వెల్ రూపంలో వస్తోంది.

కార్తీకదీపం-2 సీరియల్ కు ప్రేమివిశ్వనాథకు ఎంత రెమ్యూనరేషన్ ఇస్తున్నారనే విషయం ఇప్పుడు వైరల్ గా  మారుతోంది. ఈ సీరియల్ కోసం చాలామంది ఆతృతగా ఎదురుచూస్తున్నారు. దీని పైన అఫీషియల్ గా కూడా ప్రోమో ని విడుదల చేశారు. మార్చి 25న నుంచి స్టార్ మా చానల్లో కార్తీక దీపం -2 సీరియల్ ప్రసారం అవుతున్నది.. మలయాళం ప్రాంతానికి చెందిన ప్రేమివిశ్వనాథ్ తెలుగు ప్రేక్షకులను విపరీతంగా ఆకట్టుకుంది. రోజుకి ఒక్క సీరియల్స్ లో నటించినందుకు గాను ఈమెకు 35 వేల రూపాయలు తీసుకుంటున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి.


ప్రేమి విశ్వనాథ్ కార్తీకదీపం-2 సీరియల్ కోసం నెలలో కనీసం 15 రోజులైనా షూటింగ్లో పాల్గొంటుందట. దీన్ని బట్టి చూస్తే ఈమెకు నెలకు 5 నుంచి 6 లక్షల రూపాయల వరకు వస్తుందని చెప్పవచ్చు. అయితే ఇంతటి రెమ్యూనరేషన్ ఇస్తే ఆమెకు వర్కౌట్ అవుతుందా అంటే.. ఇటీవల సీరియల్ అలా ఎంట్రీ ఇచ్చిందో లేదో మరొకసారి రికార్డులు వేట మొదలయ్యింది.మార్చి 25న కార్తీకదీపం-2 నీ నవవసంతం అంటూ ఫస్ట్ పార్ట్ కి సీక్వెల్ గా తెరకెక్కించారు.. ఇది కొత్త కథ అయినప్పటికీ కార్తీక్ దీపాలు మిగతా వారంతా కూడా కొత్తవారు అయినప్పటికీ వంట లెక్క డాక్టర్ బాబు జంటను తెర పైన చూస్తే చాలు భారీగానే రేటింగ్ దూసుకుపోతోంది.. రూరల్ లో టిఆర్పి రేటింగ్..12.93 ఉండగా అర్బన్ లో 10.40 ఉన్నట్టుగా తెలుస్తోంది.

మరింత సమాచారం తెలుసుకోండి: