
అయితే ఈ డాన్స్ ఐకాన్ సీజన్ 2 విన్నర్ కేవలం 8 ఏళ్ల పాప బినీతా గెలుచుకుంది. అయితే ఈవెంట్ కి ముఖ్యఅతిథిగా మెగా హీరో సాయిధరమ్ తేజ్ కూడా వచ్చి మరి విజేతకు ట్రోఫీని అందించారు. అలాగే ఇందులో సీనియర్ హీరోయిన్ రమ్యకృష్ణ, ప్రముఖ కొరియోగ్రాఫర్ శేఖర్ మాస్టర్ బినీతాకు రూ .5లక్షల రూపాయలు ప్రైజ్ మనీని అందించారు. అలాగే ఓంకార్ తమ్ముడు అశ్విన్ బాబు హీరోగా నటించిన చిత్రం వచ్చినవాడు గౌతం అనే చిత్ర యూనిట్ కూడా ఈ గ్రాండ్ ఫినాలే కి హాజరయ్యారు.
ఇక హీరో అశ్విన్ బాబు కూడా ప్రైజ్ మనీ కింద మరో రూ .5 లక్షల రూపాయలు ప్రకటించారు. దీంతో మొత్తం మీద రూ .10లక్షల రూపాయలు బీనీతా ప్రైజ్ మనీ అందుకున్నది. అది కూడా ఎనిమిదేళ్ల చిన్నారి బినీతా అందుకోవడంతో అందరూ కంగ్రాట్యులేషన్స్ తెలియజేస్తున్నారు. ఈ గ్రాండ్ ఫినాలి లో మొత్తం మీద 5 మంది కంటెస్టెంట్స్ పాల్గొన్నారు.
1). యశ్వంత్ బీనితా విన్నర్..
2). బర్కత్-ప్రకృతి
3). మానస్ -సాగరిక
4). విపుల్-దీపిక
5). ముమైత్ ఖాన్-ఆన్సిక.
ఇలా మొత్తం మీద ఐదు మంది పోటీ పడగా బీనీతా విన్నర్గా గెలిచింది.