ఈ మధ్యాకాలంలో స్మార్ట్ ఫోన్లు కొత్త మోడళ్ళు.. కొత్త ఫీచర్లు.. కొత్త ధరలు మాములుగా ఉండటం లేదు. ఎప్పటికప్పుడు ధరలు తగ్గుతూ మార్కెట్ ని ఓ ఊపు ఊపేస్తున్నాయి ఈ స్మార్ట్ ఫోన్లు.. ఈ రెండు రోజుల్లోనే నాలుగు కొత్త రకాల స్మార్ట్ ఫోన్లు అందుబాటులోకి వచ్చాయి. ఇంకా అసలు విషయానికి వస్తే.. 

 

చైనాకు చెందిన ప్రముఖ మొబైల్ తయారీ సంస్థ హువేయి సబ్-బ్రాండ్ ఆనర్ సరికొత్త స్మార్ట్‌ఫోన్‌ను విడుదల చేసేందుకు సన్నాహాలు చేస్తోంది. ఈ సరికొత్త స్మార్ట్ ఫోన్ ను భారత మార్కెట్‌లోకి జనవరి 14వ తేదీన ప్రవేశపెట్టేందుకు సన్నాహాలు చేస్తున్నట్లు సమాచారం. ఈ ఆనర్ 9ఎక్స్ స్మార్ట్‌ఫోన్‌లో ఫీచర్స్ పాప్-అప్ సెల్ఫీ కెమెరా, డ్యూయల్ రియర్ కెమెరా సెటప్ అదిరిపోయేలా ఉన్నాయి. ఇంకా ఈ ఫోన్ కు సంబంధించి అదిరిపోయే ఫీచర్లు ఏంటో ఇక్కడ చదివి తెలుసుకోండి.. 

 

ఆనర్ 9ఎక్స్ స్మార్ట్‌ఫోన్‌ ప్రత్యేకతలు ఇవే..

 

ఆండ్రాయిడ్ 9.1.1, 

 

6.59 అంగుళాల హెచ్‌డీ డిస్‌ప్లే, 

 

48 మెగాపిక్సెల్ ప్రైమరీ సెన్సార్, 

 

2 మెగాపిక్సెల్ డెప్త్ సెన్సార్, 

 

16 మెగాపిక్సెల్ సెల్ఫీ కెమెరా సెన్సార్, 

 

4జీ ఎల్టీఈ, వై-ఫై, 

 

బ్లూటూత్, జీపీఎస్, యూఎస్‌బీ టైప్-సీ పోర్టు, 

 

3.5ఎంఎం హెడ్‌ఫోన్ జాక్, 

 

4,000ఎంఏహెచ్ బ్యాటరీ, 

 

సైడ్-మౌంటెడ్ ఫింగర్‌ప్రింట్ సెన్సార్.

 

ఇన్ని ప్రత్యేకతలు ఉన్న ఈ ఆనర్ 9ఎక్స్ స్మార్ట్‌ఫోన్‌ 4జీబీ ర్యామ్, 64జీబీ స్టోరేజ్ వేరియంట్ అయితే 14,400 రూపాయల ధర ఉండగా.. 6జీబీ ర్యామ్, 64జీబీ స్టోరేజ్ మోడల్ ఫోన్ రూ. 16,500, 6జీబీ ర్యామ్, 128జీబీ స్టోరేజ్ వేరియంట్ ఫోన్ రూ. 19,600 ధర ఉంది. ఈ ఫోన్ యువతీ యువకులను ఎంతగానో ఆకర్షిస్తుంది. 

మరింత సమాచారం తెలుసుకోండి: