అమ్మఒడి ల్యాప్టాప్లు ఎలా ఉంటాయనే దానిపై ఇప్పుడు ఆసక్తి నెలకొంది. అయితే ఈ ల్యాప్ టాప్ ఫీచర్లను కూడా ప్రకటించారు. ఇందులో 4 జీబీ ర్యామ్, 512 జీబీ హార్డ్ డిస్క్, విండోస్ 10 ఆపరేటింగ్ సిస్టం వంటి లేటెస్ట్ ఫీచర్లు ఉండనున్నాయి. వీటి ధర కూడా రూ.25,000 నుంచి రూ.27,000 మధ్య ఉండనుంది. ఇకపోతే ఈ ల్యాప్ టాప్ లకు మూడు సంవత్సరాలు వ్యారెంటి కూడా ఇస్తున్నట్లు ప్రభుత్వం పేర్కొంది..
8వ తరగతి పైబడిన విద్యార్థులందరికీ వారి పాఠ్యాంశాల్లో కంప్యూటర్ లిటరసీ ప్రోగ్రాంను కూడా చేర్చనున్నారు. అంటే 8వ తరగతి నుంచే కంప్యూటర్ ఉపయోగించడాన్ని పూర్తిగా నేర్పిస్తారు. గవర్నమెంట్ స్కూల్ విద్యార్థులు అన్నిటిలో చురుగ్గా ఉండటానికి ఈ ల్యాప్ టాప్ లను అందిస్తున్నట్లు ప్రభుత్వం చెప్పుకొచ్చింది. ఇకపోతే రూ.25,000 నుంచి రూ.27,000 ఖరీదైన ల్యాప్టాప్లను కేవలం రూ.18,500కే అందించనున్నట్లు ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి తెలిపారు. రివర్స్ టెండరింగ్ దీని ఖరీదును మరింత తగ్గించడానికి ప్రయత్నిస్తామన్నారు. ఈ కొత్త పథకం విద్యార్థులకు మంచి చేకూరుతుందని ఆశా భావం వ్యక్తం చేస్తున్నారు.. త్వరలోనే ల్యాప్ ట్యాప్ లను విద్యార్తులకు అందింస్తున్నారు ..
క్లిక్ చేసి ఇండియాహెరాల్డ్ వాట్సాప్ చానెల్·ను ఫాలో అవ్వండి