టాప్ మొబైల్ కంపెనీలలో ఒకటి ఒప్పో .. ఈ కంపెనీ నుంచి వచ్చిన ఎన్నో ఫోన్లు మార్కెట్ లో సందడి చేస్తున్నాయి. ఇటీవల వచ్చిన ఫోన్లు మంచి డిమాండ్ ను అందుకున్నాయి. దీంతో ఇప్పుడు మరో ఫోన్ ను మార్కెట్ లో వదిలే ప్రయత్నం చేస్తున్నారు. ఆ ఫోన్ ఎంటో ఇప్పుడు చూద్దాం.. స్మార్ట్ ఫోన్ బ్రాండ్ ఒప్పో కొత్త ఫోన్ రూపొందిస్తున్నట్లు తెలుస్తోంది. అదే ఒప్పో ఏ94. ఇది 4జీ ఫోన్ అని సమాచారం. ఈ స్మార్ట్ ఫోన్ కొత్త మోడల్ ఫోన్ దర్శనమిస్తుంది.



ఈ ఫీచర్స్ కూడా ఆన్ లైన్ లో ప్రత్యక్ష మవుతున్నాయి. ఒప్పో ఏ94 గతంలోనే చైనా సీక్యూసీ వెబ్ సైట్లో కూడా కనిపించింది. 30W ఫాస్ట్ చార్జింగ్‌ను ఈ ఫోన్ సపోర్ట్ చేయనున్నట్లు ఈ వెబ్ సైట్ల ద్వారానే తెలిసింది.ఈ లిస్టింగ్‌లో ఈ ఫోన్ ప్రాసెసర్, ర్యామ్, ఇతర వివరాలు బయటకు వచ్చాయి. ఈ స్మార్ట్ ఫోన్ ఒప్పో ఏ94లో మరో వేరియంట్ అయ్యే అవకాశం ఉంది. యూఎస్ ఎఫ్‌సీసీ వెబ్ సైట్లో కూడా కొన్ని రోజుల ముందు కనిపించింది.



ఇకపోతే ఈ సెల్ఫీ ప్రియులకు బాగా పనికి వస్తుందని తెలుస్తుంది.48 మెగాపిక్సెల్ ఏఐ ట్రిపుల్ కెమెరాను ఇందులో అందించనున్నారు. దీని బ్యాటరీ సామర్థ్యం 4310 ఎంఏహెచ్ కాగా, ఇందులో డ్యూయల్ బ్యాండ్ వైఫై కూడా ఉండనుంది. ఆండ్రాయిడ్ 11 ఆధారిత టెక్నాలజీ తో పని చేస్తుంది.మీడియాటెక్ హీలియో పీ95 కోడ్ నేమ్. దీంతోపాటు ఇందులో 6 జీబీ ర్యామ్, ఆండ్రాయిడ్ 11 వంటి ఫీచర్లు కూడా ఉండనున్నాయి.. ఇకపోతే ఫోన్ ఎన్ని వెరియంట్లలో రానుంది అనేది మాత్రం వెల్లడించలేదు.. అలాగే ధర కూడా ప్రకటించలేదు. మరి ఈ ఫోన్ ప్రత్యేకతలు ఎంటో అనేది మరి కొద్దీ రోజుల్లో తెలియనుంది. కాగా, ఎప్పటిలాగే ఈ ఫోన్ కు డిమాండ్ కూడా భారీగా పెరిగింది. 


మరింత సమాచారం తెలుసుకోండి: