సెప్టెంబర్ 19 వ తేదీ నుంచి  ఐపీఎల్ సీజన్ 2ప్రారంభం కాబోతున్న విషయం తెలిసిందే.. ఇక అభిమానులు కూడా ఫుల్ జోష్ లో ఉన్నట్టు తెలుస్తోంది.. చాలామంది క్రికెట్ ఆటను  చూడడం కోసం ఇప్పటినుంచి సన్నాహాలు సిద్ధం చేసుకుంటున్నారు.. ఈ నేపథ్యంలోనే క్రికెట్ వీక్షకు లకు పలు టెలికామ్ దిగ్గజ కంపెనీలు కూడా సరికొత్త డేటా ప్యాకేజీలతో మార్కెట్లోకి ప్రవేశిస్తున్నాయి.. చాలామంది సమయానికి ఐపీఎల్ చూడలేకపోతున్నాం అనుకునేవారు, వారికి సమయం ఉన్నప్పుడు ఐపీఎల్ ఫోన్ లో వీక్షిస్తూ ఉంటారు.

అలాంటివారిని ప్రధాన లక్ష్యంగా దృష్టిలో పెట్టుకుని టెలికాం కంపెనీలు డేటా ప్లాన్ లను కూడా ప్రకటిస్తున్నాయి. ఈ నేపథ్యంలో  టెలికాం రంగంలో భారత ఎయిర్టెల్ గా ప్రత్యేకమైన గుర్తింపు పొందిన ఎయిర్టెల్ ఆఫర్లతో తమ కస్టమర్లను ఆకట్టుకుంటోంది. ఇప్పుడు ఐపీఎల్ సీజన్ 2 కావడంతో వినియోగదారుల కోసం సరికొత్త ఆఫర్లతో ముందుకు వస్తోంది. స్మార్ట్ ఫోన్లో డిస్నీ ప్లస్ హాట్ స్టార్ లో ఎటువంటి సబ్స్క్రిప్షన్ లేకుండానే మొబైల్ రీఛార్జి తో ఐపీఎల్ చూడవచ్చు.


ఇక ఐపీఎల్ 2021 ఫ్రీగా చూడాలనుకునేవారు ఎయిర్టెల్ అందించే ఆఫర్లు గురించి ఒకసారి తెలుసుకోండి.

రూ.499 ప్లాన్ తో 3gb రోజువారీ డేటా లభించడంతోపాటు 28 రోజులు అందుబాటులో ఉంటుంది.

రూ.699 ప్లాన్ తీసుకున్నట్లయితే రోజువారి 2 జిబి డేటా తోపాటు 56 రోజులు పొందవచ్చు.

రూ.2,798 ప్లస్ తీసుకున్నట్లయితే రోజు 2 జీ బీ డేటా అలాగే 365 రోజులపాటు పొందవచ్చు.

ఈ మూడు ప్లాన్ లు కూడా అపరిమిత వాయిస్ కాలింగ్ తో పాటు రోజు 100 ఎస్ఎంఎస్, అలాగే డిస్నీ ప్లస్ హాట్ స్టార్ లో ఉచితంగా సబ్స్క్రిప్షన్ పొందవచ్చు.

అలాగే ఎయిర్టెల్ థాంక్స్ యాప్  కూడా ఉచితంగా పొందవచ్చు.. మీరు కూడా క్రికెట్ ప్రియులైతే ఇక క్రికెట్ ను ఉచితంగా మొబైల్ ఫోన్లో వీక్షించడానికి ఎయిర్టెల్ అందిస్తున్న ఈ ఆఫర్లు చక్కగా పనికొస్తాయి.


మరింత సమాచారం తెలుసుకోండి: