కొత్త సంవత్సరం సంక్రాంతి పండుగకు కొత్త ఫోన్ తీసుకోవాలి అనుకునే వారికి శుభవార్త. ముఖ్యంగా ఎవరైతే ఐఫోన్ కొనుగోలు  చేయాలనుకుంటున్నారో అలాంటి వారికి ఒక సిరీస్ పై భారీ ఆఫర్ ను ప్రకటించింది యూపిల్ సంస్థ. ముఖ్యంగా ప్రపంచ వ్యాప్తంగా యాపిల్ ఉత్పత్తులకు మార్కెట్లో ఉండే క్రేజ్ గురించి మనం ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. అందుకే చాలామంది స్టేటస్ సింబల్ గా ఐఫోన్ ను కొనుగోలు చేస్తూ ఉంటారు. మధ్యతరగతి కుటుంబాలు మాత్రం ఈ మొబైల్ కొనుగోలు చేయాలంటే వెనుక అడుగు వేస్తూ ఉంటారు. అయితే అలాంటి వారికి ఒక శుభవార్త ను తీసుకు వచ్చింది యాపిల్ సంస్థ.

2021 లో విడుదల చేసిన ఐఫోన్ 11, ఐఫోన్ 12, ఐఫోన్ 12 మినీ వేరియంట్  పై సంక్రాంతి సందర్భంగా భారీ డిస్కౌంట్ ను ప్రకటించింది.. అంతేకాదు మీరు ఎంచుకునే వేరియంట్ , కలర్ ని బట్టి కూడా డిస్కౌంట్ లో వ్యత్యాసం అనేది ఉంటుంది. ఇకపోతే మీరు ఈ కామర్స్ దిగ్గజ సంస్థలు అయినటువంటి ఫ్లిప్ కార్ట్, అమెజాన్ లో భారీ డిస్కౌంట్లతో ఈ ఐఫోన్ సిరీస్ ను కొనుగోలు చేయవచ్చు.

ఐఫోన్ 12:
ప్రస్తుతం ఫోన్ 64జిబి బ్లాక్ కలర్ వేరియంట్లలో మనకు రూ.59,999 దొర వద్ద అందుబాటులో ఉండగా బ్లూ వేరియంట్ అయితే ఫ్లిప్కార్ట్ లో రూ.60,499 ధర పలుకుతోంది. అమెజాన్ లో అయితే బ్లూ వేరియంట్ రూ.63,900 ధర చేయడం గమనార్హం.
128 జీబీ వేరియంట్ రూ.70,900 అమెజాన్లో లభిస్తుండగా ఫ్లిప్కార్ట్ లో కేవలం రూ.64,999 కే లభిస్తోంది

ఐఫోన్ 12 మినీ:
64gb బ్లూ, వైట్, బ్లాక్ వేరియంట్లు అమెజాన్ లో రూ.49,999 వుండగా.. పర్పుల్ వేరియంట్ రూ.53,900 ధర పలుకుతోంది.. ఇక గ్రీన్ వేరియంట్ అయితే రూ.59,900 ధర పలకడం గమనార్హం. ఒక 128gb రెడ్ కలర్ వేరియంట్ మనకు అమెజాన్ లో రూ.54,999 వుంటే గ్రీన్ వేరియంట్ రూ.64,900 ధర పలుకుతోంది.

ఐఫోన్ 11:
64 జీబీ వేరియంట్ ఫ్లిప్కార్ట్ లో రూ.49,900 ఉండగా 128 జీబీ వేరియంట్ రూ.54,999 గా ధర పలుకుతున్నాయి.

మరింత సమాచారం తెలుసుకోండి: