ప్రపంచం ఇప్పుడిప్పుడే 5g స్పీడ్ తో కదులుతోందనుకుంటే , జపాన్ మాత్రం ఇక లైట్ స్పీడ్ దిశగా అడుగులు వేస్తోంది . తాజాగా అక్కడ నిర్వహించిన ఒక ఇంటర్నెట్ పరీక్షలో, బుల్లెట్‌ స్పీడ్ ఇంటర్నెట్ కనెక్షన్ తో సెకన్లలోనే భారీ వీడియోలు , సినిమాలు డౌన్‌లోడ్ చేయగలిగారు . జపాన్‌లో ని నిప్పోన్ టెలిగ్రాఫ్ అండ్ టెలిఫోన్ (NTT) అనే టెలికాం దిగ్గజం , కొత్తగా అభివృద్ధి చేసిన టెక్నాలజీతో 1.2 టెరాబిట్స్/సెకన్ (Tbps) స్పీడ్‌కి పైగా డేటా ట్రాన్స్‌ఫర్‌ని విజయవంతం గా ప్రదర్శించింది . అంటే సాధారణంగా మనం నెట్‌ఫ్లిక్స్‌లో చూసే HD సినిమాలు కేవ‌లం సెకన్లలోనే డౌన్‌లోడ్ అవుతాయి.


ఒక 1 జీబీ ఫైల్‌ డౌన్‌లోడ్ అవడానికి మన దగ్గర కనీసం 5–10 సెకన్లు పడుతుంటే , జపాన్ టెక్నాలజీ తో అది ఒక చుక్కలోనే పూర్తి అవుతుంది . దీనిని బుల్లెట్ ఇంటర్నెట్ అని కూడా పిలుస్తున్నారు - బుల్లెట్ రైలు స్పీడ్‌లా డేటా ప్రయాణిస్తుంది ! NTT సంస్థ అభివృద్ధి చేసిన ఈ సూపర్ స్పీడ్ నెట్‌వర్క్‌లో, ఆప్టికల్ ఫైబర్‌లో 4 స్టాండర్డ్ ఛానెళ్ల ద్వారా ఒకేసారి ట్రాన్స్మిషన్ జరిగి , నెట్‌వర్క్ ను బ్రేక్ లేకుండా , హై బాండ్‌విడ్త్ తో నడిపేలా రూపొందించారు.



ఇది ఇంకా పరిశోధన దశలో ఉంది . అయితే 2030 నాటికి ఈ టెక్నాలజీ వాణిజ్య రీతి లో వినియోగం లోకి వస్తుందని భావిస్తున్నారు . ప్రపంచ వ్యాప్తంగా డేటా వినియోగం పెరుగుతోన్న ఈ రోజుల్లో, ఈ రకమైన సూపర్ స్పీడ్ నెట్‌వర్క్‌లు అవసరమవుతాయ ని నిపుణులు చెబుతున్నారు . నెట్‌ఫ్లిక్స్ యూజర్లు , గేమింగ్ ప్రేమికులు , టెక్నాలజీ పై ఆస‌క్తి ఉన్న వారు దీని పై విపరీతంగా స్పందిస్తున్నారు . “ఒక్క క్లిక్ తో సినిమా మొబైల్‌లోకి వచ్చేస్తే .. అదేం ఫీలింగ్!”, “మన దేశంలో ఎప్పుడవుతుంది ఇలాంటిది ?” అంటూ నెటిజన్లు కామెంట్ల వర్షం కురిపిస్తున్నారు . జపాన్ టెక్నాలజీ ఇంకోసారి ప్రపంచాన్ని షాక్‌కు గురి చేసింది . ఈ స్పీడ్ భారత్‌కి వచ్చినా, ఇంటర్నెట్ వినియోగం లో నిజంగా “కొత్త యుగం” మొదలవుతుంది!


మరింత సమాచారం తెలుసుకోండి: