ఆకాశంలో కొన్ని కొన్ని సార్లు జరిగే అద్భుతాలు ఎంతోమందిని ఆశ్చర్యపరుస్తూ ఉంటాయన్న విషయం తెలిసిందే. అయితే ఆకాశంలో ఏదైనా వింతగా కనిపించింది అంటే చాలు నేటి రోజుల్లో అందరూ కూడా ఏలియన్స్ అని ఫిక్స్ అయి పోతూ ఉంటారు. ఏలియన్ స్పేస్ షిప్ లో ఆకాశంలో తిరుగుతూ ఉన్నాయని భావిస్తూ ఉంటారు. ఇక ఇటీవలే ఉగాది పండుగ సందర్భంగా ఇలాంటి ఒక అద్భుతమైన ఘట్టమే ఆకాశం లో అందరిని ఆకర్షించింది.. అయితే ఆకాశంలో కనిపించింది ఏలియన్స్ కాదు..  ఏకంగా ఉల్కలు భూమ్మీదికి పడి పోతూ ఉండటం కనిపించింది.


 కొన్ని కొన్ని సార్లు ఆకాశంలో ఉన్న నక్షత్రాలను చూస్తున్న సమయంలో ఒక్కసారిగా ఉల్కలు భూమి మీదకి పడి పోతూ ఉండటం కనిపిస్తూ ఉంటుంది. ఇక ఇది చూసి అందరూ ఆశ్చర్యంలో మునిగిపోతూ ఉంటారు. ఎంతో ఆసక్తిగా తిలకిస్తూ ఉంటారు. ఇక ఇటీవలే ఉగాది పండుగ వేళ ఆకాశంలో ఇలాంటి అద్భుతమైన దృశ్యం కనిపించింది. అయితే సాధారణంగా ఎప్పుడో ఒక్కసారి మాత్రమే ఇలా ఉల్కలు భూమ్మీదికి పడిపోతూ వుండడం చూస్తూ వుంటాము. కాని ఇక్కడ మాత్రం ఏకంగా పదుల సంఖ్యలో ఉల్కలు భూమి మీదకు పడిపోతూ చూపరులను ఎంతగానో ఆకట్టుకున్నాయి. శనివారం రాత్రి సమయంలో ఈ ఘటన జరిగింది.



 మహారాష్ట్ర లోని నాగాపూర్ లో.. మధ్య ప్రదేశ్ లోని పలు ప్రాంతాలలో కూడా ఈ ఘటన చోటుచేసుకుంది అని తెలుస్తోంది. ఇక మహారాష్ట్ర తెలంగాణ సరిహద్దు ప్రాంతమైన కొమరం భీమ్ ఆసిఫాబాద్ జిల్లా లోని కొన్ని ప్రాంతాల్లో ఉల్కలు పడిపోతున్న దృశ్యాలు కనిపించాయి. ఈ క్రమంలోనే ఒక్కసారిగా ఎక్కువ మొత్తంలో ఉల్కలు పడిపోతూ ఉండటాన్ని చూసి అందరూ ఆశ్చర్యంలో మునిగిపోయారు. ఇంకేముంది అర చేతిలో ఉన్న స్మార్ట్ఫోన్ లో ఇక అక్కడ జరుగుతున్న అద్భుతమైన దృశ్యాన్ని చిత్రీకరించారు. వీటిని సోషల్ మీడియాలో పోస్ట్ చేయడంతో వైరల్ గా మారిపోయాయ్. ఇంకెందుకు ఆలస్యం మీరు కూడా ఈ అద్భుత దృశ్యాన్ని ఒకసారి చూసేయండి..

మరింత సమాచారం తెలుసుకోండి: