దేశంలో అసలే ఇప్పుడు కరోనాతో నానా తంటాలు పడుతుంటే.. ఇప్పుడు గాలి వాన ఒకటి మొదలైంది.  ఇప్పటికే పేద ప్రజలు కరోనా భయంతో నానా కష్టాలు పడుతున్నారు.. ఇదేసమయంలో ఇప్పుడు వర్ష బీభత్సంతో పాటు పెను గాలి వల్ల ఎప్పుడు ఏం జరుగుతుంతో అన్న భయంతో బతుకుతున్నారు.  మొన్న మిడ్జిల్ మండల పరిధిలోని మున్ననూర్ టోల్ ప్లాజా వద్ద జాతీయ రహదారి 167 సమీపంలో గాలి దుమారంతో రేకుల షెడ్డు కూలి భార్యభర్తలు ఇద్దరు మృతి చెందారు. వ్యవసాయ పంటను రోడ్డుపై ఎండకు ఆర బెట్టారని, గాలి విపరీతంగా రావడంతో మున్ననూర్ టోల్ ప్లాజా దగ్గర ఉన్న రేకుల షెడ్డు గాలిలో లేచి రైతులపై పడడంతో ఇద్దరు భార్యాభర్తల మృతి చెందారు.

తాజాగా ఖమ్మం జిల్లాలో ఈదురు గాలులు టెన్షన్ పుట్టించాయి. వేగంగా దూసుకువస్తున్న గాలులకు ప్రజలు వణికిపోయారు. పెద్ద ఎత్తున వస్తువులు ఎగిరిపోయాయి. చెట్లు స్తంభాలు నేలకూలాయి. సత్తుపల్లిలో అయితే గాలి వేగానికి ఏకంగా రోడ్డుపై నిలిపి ఉంచిన బస్సు  కొట్టుకుపోయింది. దీంతో అక్కడున్న వారంతా హడలిపోయారు.   రోడ్డు పక్కన ఓ ప్రైవేట్ ట్రావెల్ బస్సును నిలిపి ఉంచారు. ఈ క్రమంలో గాలి వేగంగా వీయడంతో అది వెనక్కి వెళ్లిపోయింది. కొంత దూరం వెళ్లి ఓ చెట్టును ఢీ కొట్టి ఆగిపోయింది.  

 

 

అయితే డ్రైవర్ హ్యాండ్ బ్రేక్ వేయకపోవడంతోనే అది వెనక్కి వెళ్లినట్టుగా చెబుతున్నారు. ఆ సమయంలో బస్సులో ఎవరూ లేరు. దీనికి సంబంధించిన వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.  కాకపోతే అందులో ఎవరూ లేకపోవడం వల్ల పెను ప్రమాదం తప్పిందని అంటున్నారు. అయితే ఈదురు గాలి వల్ల చెట్లు విరిగిపోతున్నాయి.. గుడిసెలు ఎగిరిపోతున్నాయి.  దాంతో గుడిసెలు ఆవాసంగా చేసుకున్న వారి పరిస్థితి అగమ్య గోచరంగా మారిందిన బాధపడుతున్నారు. 

మరింత సమాచారం తెలుసుకోండి: