మనుషులకు పట్టిన కరోనా వైరస్‌ను వదిలించేందుకు ఇప్పటికే కొన్ని మూగజీవులను ప్రయోగాల్లో ఉపయోగించారు. వాటిపై వ్యాక్సిన్ పనిచేసిన తర్వాతే మనుషులపై వాటిని ప్రయోగించారు. ఈ నేపథ్యంలో సుమారు 5 లక్షల షార్క్(సొర) చేపలను వేటాడేందుకు సన్నహాలు జరుగుతున్నాయట. అయితే వీటిని వ్యాక్సిన్ ప్రయోగం కోసం కాదు.. వ్యాక్సిన్ తయారీ కోసం ఉపయోగించనున్నారు.
చేపల కాలేయంలో ‘స్క్వాలేన్’ అనే ఆయిల్ తయారువుతుంది. దీన్ని ఔషదాల తయారీలో ఉపయోగిస్తారు. కరోనా వైరస్ వ్యాక్సిన్‌లో ఉపయోగిస్తున్న ఔషదాల్లో ఇది కూడా ఉందని జంతు ప్రేమికులు తెలుపుతున్నారు. ప్రపంచమంతా వ్యాక్సిన్ సిద్ధం చేయడం మొదలుపెడితే.. రెండు డోసుల కోసం సుమారు 5 లక్షల షార్క్ చేపలు అవసరం అవుతాయని భావిస్తున్నారు. ఈ నేపథ్యంలో జంతు ప్రేమికులు.. వ్యాక్సిన్ తయారీ కోసం షార్క్ చేపలను చంపొద్దంటూ ఉద్యమానికి సిద్ధమవుతున్నారు. ఈ సందర్భంగా ఆన్‌లైన్ పిటీషన్ ద్వారా సంతకాలను సైతం సేకరిస్తున్నారు.
దీనిపై షార్క్ అలియాస్ వ్యవస్థాపకురాలు స్టెఫానీ బ్రెండల్ మాట్లాడుతూ. ‘‘షార్క్‌లు చాలా అరుదైనవి. సాధారణ చేపల తరహాలో వాటి పెంపకం సాధ్యం కాదు. వాటి పునరోత్పత్తి కూడా చాలా ఆలస్యంగా ఉంటుంది. ఏటా వ్యాక్సిన్ కోసం వాటిని చంపుకుంటూ పోతే.. భవిష్యత్తులో అవి కనుమరుగు అవుతాయి. మేం కరోనా వ్యాక్సిన్ ప్రక్రియ ఆపాలని అనుకోవడం లేదు. షార్కులకు బదులు ఇతర విధానాల్లో ‘స్క్వాలేన్’ సేకరణకు ప్రయత్నించాలని మాత్రమే కోరుతున్నాం’’ అని తెలిపారు.
క్లిక్ చేసి ఇండియాహెరాల్డ్ వాట్సాప్ చానెల్·ను ఫాలో అవ్వండి