ఇండియా హెరాల్డ్ అందిస్తున్న ఈ ఆర్టికల్ చదవండి...సాదారణంగా దెయ్యాలు, భూతాలు గురించి అందరూ మాట్లాడుకోవడం వింటూ ఉంటాము. అసలు నిజంగా దెయ్యాలు ఉంటాయా అని అంటే ఆ విషయం మనం చెప్పలేము. కాని కొన్ని కొన్ని సందర్భాల్లో దెయ్యాలు, ఆత్మలు బయట కనిపించడం చూస్తూ ఉంటాము. అవి నిజమో కాదో మనం చెప్పలేము కాని మళ్ళీ ఓ సందర్భంలో అలాంటి ఆత్మలు దెయ్యాలు బయట పడటం జరిగిందట.. ఓ పెట్రోల్ బంకులో కొంతమంది యువకులు ఒక చోటకు చేరి కేక్ కట్ చేస్తూ సెలబ్రేట్ చేసుకున్నారు. అదే సమయంలో వారి వెనుకాల ఏదో తెల్లని ఆకారం పరిగెడుతూ కనిపించింది. సుమారు రెండు నుంచి మూడు సెకన్లు మెరుపుతీగలా కనిపించి మాయమైంది. అయితే, మొదట్లో ఆ యువకులు ఈ విషయాన్ని గుర్తించలేదు. వీడియోను మళ్లీ చూసుకున్నప్పుడు వారికి ఆ ఆకారం కనిపించింది.

అయితే, కొందరు దాన్ని సిగరెట్ పొగ కావచ్చని అంటున్నారు. అది పెట్రోల్ బంక్ కాబట్టి.. దగ్గర్లో ఏదైనా వాహనం నుంచి పొగ వచ్చి ఉంటుందని మరికొందరు అంటున్నారు. పైగా.. ఆ ఆకారం కదులుతున్నప్పుడు ఆ గుంపులో ఉన్న ఓ యువకుడు దాన్ని చూడటాన్ని కూడా ఈ వీడియోలో చూడవచ్చు. ఒక వేళ అది ఆత్మ లేదా దెయ్యమై ఉంటే ఆ వ్యక్తి కంగారుపడి ఇతరులను కూడా అప్రమత్తం చేసేవాడు. కాబట్టి.. ఏదైనా పొగ కావచ్చని మరికొందరు అంటున్నారు.ఇక ఇలాంటి మరెన్నో వైరల్ న్యూస్ ల కోసం ఇండియా హెరాల్డ్ గ్రూప్ ని ఫాలో అవ్వండి. ఇంకా మరెన్నో విషయాలు తెలుసుకోండి...

మరింత సమాచారం తెలుసుకోండి: