దేవుడు సృష్టించిన ఈ లోకంలో పక్షులు చాలా అందమైనవి. చాలా స్వేచ్చాపూరీతమైన జీవాలు. ఇక పక్షుల్లో ఎన్ని రకాలు వున్నా కాని చిలకలకు ప్రత్యేకమైన స్థానం వుంది. చిలుకలు ఎంతో అందమైన పక్షులు. అవి పలికే తేనె పలుకులకి ఎవరైనా వాటికి ఫిదా అయిపోతారు. అందుకే చాలా మంది వాటిని పెంచుకుంటుంటారు. ఇక ఎంతో అపురూపంగా పెంచుకున్న చిలుకలు మిస్ అయితే ఎలా ఉంటుంది. ఎంతో బాధకరంగా ఉండదు. అవి మిస్ అయితే మనం ఏం చేస్తాం? మహా అయితే రెండు మూడు రోజులు చాలా బాధ పడతాము. కాని ఒక యజమాని మిస్ అయిన తన చిలక విషయంలో ఏం చేసాడో తెలిస్తే షాక్ అవ్వాల్సిందే... అయితే ఆ షాకింగ్ న్యూస్ ఏంటో చూడండి....


ఒక యజమాని తను అపురూపంగా పెంచుకునే చిలుకను విమానంలో లండన్ తీసుకెళ్లేందుకు అన్ని ఏర్పాట్లు చేశారు. ఇంతలో ఏమైందో ఏమో.. ఆ చిలుక కనిపించకుండా పోయింది. దీంతో ఆ యాజమాని బాధకు అంతులేదు. తన చిలుకను మీరే వెతికి పెట్టాలంటూ.. పోలీసులను వేడుకున్నారు. దీంతో పోలీసులు కేసు నమోదు చేసి చిలుక కోసం అన్వేషణ మొదలుపెట్టారు.ఉత్తరప్రదేశ్‌లోని అలీఘడ్‌కు చెందిన ఆర్థోపెడిక్ సర్జన్ డాక్టర్ ఎస్.ఎసి.వర్షిణీ.. కుమార్తె సౌమ్య రెండున్నరేళ్ల కిందట బెంగళూరులో నివసించేది. పక్షులను ఎంతో ఇష్టపడే ఆమె సిమెంట్ రంగు శరీరం, ఎర్ర తోక, నల్ల ముక్కుతో గల ఆఫ్రికన్ చిలుకను కొనుగోలు చేసింది. దానికి ‘మిథు’ అని పేరు పెట్టుంది. పెళ్లి తర్వాత సౌమ్య లండన్ వెళ్లిపోయింది. దీంతో అది సౌమ్య అత్త సరోజ్ సింగ్ ఇంట్లోనే మిథు ఉంటోంది.


సడెన్ గా తన చిలక మాయం కావడంపై సరోజ్ బాధపడుతోంది.మిథు.. ఇంగ్లీషులో మాట్లాడగలదని, అది ఇంట్లో నుంచి తప్పిపోయిన ముందు రోజు తనకి ‘ఐ లవ్ యు సరోజ్’ అని చెప్పిందని తెలిపింది. దాన్ని కనుగోనేందుకు కరపాత్రలు పంచుతున్నామని, దాన్ని ఇంటికి తిరిగి తెచ్చినవారికి రూ.5 వేలు నజరానా ఇస్తామని పేర్కొంది. దాన్ని లండన్ పంపించేందుకు అన్ని డాక్యుమెంట్లను సిద్ధం చేశామని, ఇంతలోనే అది మాయమైందని తెలిపింది. అలిఘడ్‌లోని క్వార్సి పోలీస్ స్టేషన్‌లో ఈ కేసు పెట్టడం జరిగింది. ప్రస్తుతం ఈ న్యూస్ వైరల్ గా మారి ట్రెండింగ్ లో వుంది...

మరింత సమాచారం తెలుసుకోండి: