శీతాకాలం అంటే చాలు చిన్న , పెద్ద చలితో వణికిపోతూ చాలా ఇబ్బంది పడుతూ ఉంటారు. ముఖ్యంగా ఎంతోమంది ఆస్తమా రోగులు తీవ్ర ఇబ్బందులను ఎదుర్కోవాల్సి వస్తుంది. ఇకపోతే శ్వాసకు సంబంధించిన సమస్యలు వచ్చి ఈ ఆస్తమా రోగులను సతమతం చేస్తూ ఉంటాయి.. ఈ మధ్య కాలంలో కాలుష్యం ఎక్కువగా పెరిగిపోవడం వల్ల రోజురోజుకు ఆస్తమా రోగులు ఎక్కువ అవుతున్నారు. ఇక అలాంటి వారు తమ ఊపిరితిత్తులను బలోపేతం చేసుకోవడానికి ముఖ్యంగా శ్వాస సంబంధిత వ్యాయామాలు చేయాలని వైద్యులు చెబుతున్నారు.


మన పరిసరాలు చుట్టూ పరిశుభ్రంగా ఉండేలా, పచ్చటి వాతావరణంలో ప్రతిరోజు రెండు గంటలపాటు గడిపేలా సమయాన్ని కేటాయించుకోవాలి అని నిపుణులు సలహా ఇస్తున్నారు.. కాలుష్యం,  రద్దీ ఎక్కువగా ఉండే ప్రదేశాలకు వెళ్లకుండా ఉండడమే మంచిది అని చెబుతున్నారు.. ఇలా అన్ని రకాల జాగ్రత్తలు పాటిస్తే శీతాకాలం నుంచి మనం తప్పించుకోగలుగుతాము అని చెబుతున్నారు వైద్యులు. ఇకపోతే వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ గణాంకాల ప్రకారం.. ప్రపంచంలో 235 మిలియన్ల మంది ప్రజలు ఈ ఆస్తమాతో బాధపడుతున్న ట్లు లెక్కలు తేల్చారు.. ఈ రెండు వందల ముప్పై ఐదు మిలియన్ల మంది ప్రజలలో ఎక్కువగా పిల్లలు, వృద్ధులు ఉండడం గమనార్హం..

ప్రతి సంవత్సరం 40 లక్షల మంది చిన్నారులు ఆస్తమా బారిన పడుతున్నారని ఒక నివేదికలో వెల్లడించారు.. శీతాకాలంలో ఆస్థమా రోగులు దుమ్ము,ధూళి, బహిరంగ వాతావరణానికి చాలా దూరంగా ఉండటం మంచిది.. శీతల పానీయాలు , చల్లని ప్రదేశాలకు కూడా దూరంగా ఉండాలి.. మాస్క్ ధరించడం, ధూళి , దుమ్ము కి దూరంగా ఉండటం వంటి వాటి నుంచి జాగ్రత్తలు తీసుకోవడం వల్ల ఈ శీతాకాలంలో ఆస్తమా నుంచి బయట పడవచ్చు అని చెబుతున్నారు. కాబట్టి ముఖ్యంగా ఆస్తమా వ్యాధిగ్రస్తులు ఈ శీతాకాలంలో జాగ్రత్తలు పాటించకపోతే , ఊపిరి సంబంధిత సమస్యలు రావడంతో పాటు ప్రమాదవశాత్తు మరణం సంభవించే అవకాశాలు కూడా ఉన్నాయని డబ్ల్యూహెచ్వో హెచ్చరిస్తోంది.

మరింత సమాచారం తెలుసుకోండి: