ప్రశాంతంగా ఉన్న ఏపీని ప్రస్తుతం ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాలు కురుస్తున్న అల్లకల్లోల పరిస్థితులను సృష్టిస్తున్నాయి అనే విషయం తెలిసిందే  ఇక భారీ వర్షాల కారణంగా వస్తున్న వరదలతో జనజీవనం స్తంభించి పోతుంది. కొన్ని ప్రాంతాల్లో అయితే ప్రజల ప్రాణాలను అరచేతిలో పెట్టుకుని బతుకుతున్నారు అని చెప్పడంలో అతిశయోక్తి లేదు. ఎక్కడ చూసినా పూర్తిగా వరద నీరు నిలిచిపోయి పూర్తిగా జనావాసాల్లోకి నీళ్లు వచ్చి అందరూ తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఈ క్రమంలోనే అటు అధికారులు ఎప్పటికప్పుడు అప్రమత్తంగా ఉంటూ సహాయక చర్యలు చేపడుతున్నారు అన్న విషయం తెలిసిందే. అయితే కొన్ని ప్రాంతాలలో భారీగా కురుస్తున్న వర్షాల కారణంగా వస్తున్న వరదలలో చిక్కుకొని ఎంతోమంది ప్రాణాలు కోల్పోయిన ఘటనలు కూడా వెలుగులోకి వస్తున్నాయి.


 ఇలా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని చాలా ప్రాంతాలు జలదిగ్బంధంలో కి వెళ్లి పోయాయి అని చెప్పాలి. అయితే సాధారణంగా వరదలు వచ్చిన సమయంలో బైక్ లు, కార్లు కొట్టుకు పోవడం లాంటి వీడియోలు ఇప్పటికే చాలాసార్లు సోషల్ మీడియాలో వైరల్ గా మారిపోయాయి. కానీ ఇప్పుడు మాత్రం ఏకంగా ఒక బిల్డింగ్ వరదల్లో కొట్టుకుపోవడం ప్రస్తుతం హాట్ టాపిక్ గా మారిపోయింది. ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ గా మారిపోతున్న ఈ వీడియో చూస్తే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో వరదల కారణంగా ఎంత దారుణమైన పరిస్థితి ఏర్పడింది అన్నది అర్ధమవుతుంది.


 అయితే ఏపీలో ఇప్పటికే భారీగా వర్షాలు కురుస్తుండగా అటు తిరుపతి లో చరిత్రలో ఎన్నడూ లేనివిధంగా అతి భారీ వర్షాలు కురుస్తూ ఉండటం గమనార్హం. తిరుపతి లో ఎక్కడ చూసినా కూడా అన్ని ప్రాంతాలు జలదిగ్బంధంలో కి వెళ్ళిపోయాయ్. ఈ క్రమంలోనే ఇటీవలే తిరుచానూరులో వున్న వసుంధర నగర్ లో వరద ఉధృతికి ఏకంగా ఒక బిల్డింగ్ కొట్టుకుపోవడం కాస్త సంచలనంగా మారిపోయింది. ఇప్పటికే రోడ్డుపై ఉన్న చిన్న చిన్న దుకాణాలు సైతం వరద ఉధృతికి ధ్వంసమవుతున్నాయి. ఈ క్రమంలోనే భారీ వర్షాల నేపథ్యంలో ప్రజలు అందరూ అప్రమత్తంగా ఉండాలని వాతావరణశాఖ అధికారులు హెచ్చరిస్తున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: