ఈ మధ్య మన దేశం లో దీని వ్యాప్తి బాగా తగ్గడం తో ప్రజలు సంతోషంగా మళ్ళీ తిరిగి సాధారణ జీవితాన్ని గడుపుతున్నారు. అయితే ఇపుడు కోవిడ్ 19 కి సంబంధించిన మరో న్యూస్ అందరినీ ఆందోళనకు గురుచేస్తుంది అని చెప్పొచ్చు. కరోనా నుండి ఎలాగోలా కోలుకొని ఇక తప్పించుకున్నాం అని అనుకున్న ప్రతిసారీ ఏదో రకంగా ఇబ్బంది పెడుతూనే ఉంది...కరోనా నుండి కోలుకున్న చాలామంది ఇతర అనారోగ్య సమస్యలకు గురికావడం ఇప్పుడు మరింతగా కలవరపెడుతోంది. అవును కరోనా నుండి కోలుకున్న వారిలో పలువురు ఇప్పటికే వివిధ రకాల అనారోగ్య సమస్యల బారిన పడినట్లుగా సమాచారం. కరోనా నుండి కోలుకున్న కొంతమంది లో
తుంటి కీలు అరిగిపోతుందని వైద్యులు చెబుతున్నారు.
ఇందులో 90% మంది పురుషులే కావడం గమనార్హం.
సాధారణంగా వయసు మీద పడ్డ తరవాత ఈ సమస్య కనపడుతూ ఉంటుంది...కానీ కరోనా సోకిన సమయం లో ఎవరికైతే స్టెరాయిడ్స్ ను అధికంగా వాడి ఉంటారో అటువంటి వారిలో ఎక్కువగా ఈ సమస్య బయట పడుతుందని నిపుణులు చెబుతున్నారు.
తుంటి కీలు మార్పిడి చేయించుకోవడం ద్వారా ఈ సమస్య నుండి బయట పడవచ్చు అని వైద్యులు అంటున్నారు.
మొదట ఈ వ్యాది నిర్దారణ అయితే దాని స్టేజి ని బట్టి ముందుగా మందులు వాడటం లేదా తప్పనిసరి పరిస్థితి అనుకుంటే
తుంటి కీలు మార్పిడి చేయాల్సి వస్తుందని డాక్టర్లు చెబుతున్నారు.
మరో వైపు చైనా, దక్షిణ కొరియా వంటి దేశాలలో మళ్ళీ కరోనా తన పంజాను విసురుతూ ప్రపంచ దేశ ప్రజలను కలవరపెడుతోంది.
క్లిక్ చేసి ఇండియాహెరాల్డ్ వాట్సాప్ చానెల్·ను ఫాలో అవ్వండి