అయితే ఐక్యమత్యమే మహాబలం అన్నది అక్షరాల నిజం అన్న దానికి నిదర్శనంగా ఇప్పుడు వైరల్ గా మారిపోయిన వీడియో ఉంది అని చెప్పాలి. సాధారణంగా ఈ ప్రకృతిలో ప్రతి జంతువు కూడా ఆహారం కోసం వేట సాగిస్తూ ఉంటుంది. ఇక ఈ ఆహారం కోసం అన్వేషణలో భాగంగా ఇతర జంతువులను వేటాడటం కూడా ఒక భాగమే. ఈ క్రమంలోనే కొన్ని జంతువులు మరి కొన్ని జంతువులకు ఆహారంగా మారడానికి పుట్టాయేమో అన్నట్లుగా అనిపిస్తూ ఉంటుంది. అయితే సింహాలు అడవి దున్నలను వేటాడుతున్న సమయంలో కొన్ని కొన్ని సార్లు అడవి దున్నలు ఐక్యమత్యంగా ఒక గ్రూపుగా ఏర్పడి సింహాలను భయపెట్టడం లాంటివి కూడా చేస్తూ ఉంటాయ్.
ఇప్పుడు పక్షులు ఐకమత్యాన్ని ప్రదర్శించిన ఒక వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారిపోయింది. సాధారణంగా పిల్లులు పక్షులను వేటాడటం జరుగుతూ ఉంటుంది. ఇక్కడ ఒక పిల్లి పక్షులను వేటాడటానికి ప్రయత్నించింది. కానీ పక్షులు మొత్తం ఐక్యమత్యంగా ఆ పిల్లి పై దాడి చేయడం ఈ వీడియోలో చూడవచ్చు. వీడియో సోషల్ మీడియా వేదికగా తెగ హల్చల్ చేస్తోంది అని చెప్పాలి. పిల్లి ఎగిరి పక్షిని నోట్లో పట్టుకుంటుంది. ఇంతలో ఇక స్నేహితులని పిల్లిపై దాడి చేయడం ప్రారంభించాయ్. దీంతో భయపడిపోయిన పిల్లి పక్షి ని వదిలి పారిపోయింది.
క్లిక్ చేసి ఇండియాహెరాల్డ్ వాట్సాప్ చానెల్·ను ఫాలో అవ్వండి