ఈ భూమి మీద ఎన్నో రకాల జీవరాసులు ఉన్నప్పటికీ కొన్ని జంతువులతో మాత్రం మనుషులకి కాస్త దగ్గర బంధమే ఉంటుంది అని చెప్పాలి.  ఇలా మనుషులతో ప్రత్యేకమైన బంధాన్ని కలిగి ఉన్న జంతువులలో భారీ ఆకారం ఉండే ఏనుగులు కూడా ఉన్నాయి.  వీటి జీవన విధానానికి మానవ జీవన విధానానికి దగ్గర పోలికలు ఉంటాయని ఎంతోమందిని జంతు ప్రేమికులు చెబుతూ ఉంటారు. అంతేకాదు ఏనుగులు ఎలా జీవిస్తాయి ఎలా ఆహారాన్ని సంపాదిస్తాయి మనుషులతో ఎలా ప్రవర్తిస్తాయి అనేదానికి సంబంధించిన ఎన్నో వీడియోలు సోషల్ మీడియాలో ఎప్పుడు వైరల్ గా మారిపోతూనే ఉంటాయి.


 ఏకంగా ఏనుగులు మనుషులతో ఎంతో ప్రేమగా ఉంటూ.. చెప్పినట్లుగా వినడం లాంటివి కూడా అప్పుడప్పుడు వీడియోలలో చూస్తూ ఉంటాం. ఇక్కడ ఒక మనిషికి సహాయం చేసింది ఏనుగు. ట్రక్కు తడి మట్టిలో ఇరుక్కుపోయింది. ఈ క్రమంలోనే బయటికి తీసేందుకు ఎంతగానో ప్రయత్నాలు చేసారు అక్కడున్నవారు. కానీ ఇలాంటి సమయంలోనే గజరాజు ఆ ట్రక్కుని తడి మట్టి నుంచి బయటకు తీసేందుకు మనుషులకు సహాయం చేసింది. ఇందుకు సంబంధించిన వీడియో ట్విట్టర్ లో తెగ చక్కర్లు కొడుతుంది. మహారాష్ట్రలోని నాందేడ్లో దసరా పండుగ సందర్భంగా పెద్ద జాతర నిర్వహిస్తారు.


 ఈ జాతరలో పాల్గొనేందుకు ఒక బృందం రాగ వారితో పాటు అమృత్సర్ నుంచి ఒక ఏనుగు కూడా వచ్చింది. ఇక ఇదే బృందంతో 60 గుర్రాలు కూడా  ఉన్నాయి. అయితే సిక్కులు ఇప్పటికీ కూడా గుర్రాలు ఏనుగులను తమ సైన్యంగా భావిస్తూ ఉంటారు అన్న విషయం తెలిసిందే. ఈ క్రమంలోనే కొందరు సిక్కు యువకుల బృందం అమృత్సర్ నుంచి నాందేడ్ కు రాగ సిక్కు సంఘానికి చెందిన మరో బృందం కొలారస్ లోని బటోవ గ్రామంలో సేవ చేయడానికి వెళుతుంది. గ్రామీణ ప్రాంతం కావడంతో ఈ బృందం వెళ్తున్న ట్రక్ రహదారిపై పార్క్ చేయాల్సి ఉండగా ఆకస్మాత్తుగా భారీగా కురిసిన వర్షాలకు బురదలో కూరుకుపోయింది. అయితే ఇలా బురదలో ఇరుక్కున్న ట్రక్కును బయటకు తీయడానికి అక్కడున్నవారు  ప్రయత్నించారు. తమ శక్తిని అంతా ఉపయోగించినప్పటికీ కూడా పూర్తిగా ట్రక్కు మాత్రం బురద నుంచి బయటకు రాలేకపోయింది. ఇలాంటి సమయంలోనే అటువైపుగా వెళ్తున్న  సిక్కు బృందం  తమ వద్ద ఉన్న ఏనుగులతో సహాయం చేసింది. గజరాజుకు ఉండే బలం గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. గజరాజు సాయంతో చివరికి ట్రక్కు బురద నుంచి బయటపడింది. ఇందుకు సంబంధించిన వీడియో వైరల్ గా మారిపోవడంతో ఏనుగులు చేసిన పనికి నెటిజెన్లు ఫిదా అవుతున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: