టాలెంట్ ఎవరి సొత్తు కాదు.. ఈ మాటకు ఉదాహరణగా సోషల్ మీడియాలో ఎన్నో వీడియోలు ప్రత్యక్షమవుతూ ఉంటాయి. పెద్దగా చదువుకోకపోయినప్పటికీ.. టెక్నాలజీ పై ఎక్కువగా అవగాహన లేకపోయినప్పటికీ ఎంతో మంది అద్భుతాలు చేసి చూపిస్తూ ఉంటారు అని చెప్పాలి. ఇలాంటి వీడియోలు చూసినప్పుడు ప్రతి ఒక్కరికి టాలెంటు ఎవరి సొత్తు కాదు అనే అనిపిస్తూ ఉంటుంది అని చెప్పాలి. ఇక ఇప్పుడు ఇలాంటి తరహా వీడియో ఒకటి ట్విటర్ వేదికగా చక్కర్లు కొడుతుంది .


 ఏ పనిలో అయినా సిద్ధహస్తుడు కావాలి అంటే ఒక ప్రత్యేకమైన టెక్నిక్ ఉండాలి. అయితే ఇలా చేపలు పట్టడంలో అయితే ఈ టెక్నిక్ కాస్త ఎక్కువే ఉండాలి అని చెప్పాలి. ఎందుకంటే చేపలు పట్టడం కూడా ఒక ఆర్ట్. ఎంతోమంది ఎంతో చాకచక్యంగా చేపలు పట్టడం లాంటి వీడియోలు సోషల్ మీడియాలోకి వస్తు వైరల్ గా మారిపోతూ ఉంటాయి అన్న విషయం తెలిసిందే. ఇక ఇప్పుడు ఒక పిల్లాడు చేపలు పట్టేందుకు వేసిన ఐడియా కాస్త అందర్నీ ఆశ్చర్యపరుస్తూ ఉంది. ఆ పిల్లాడి టాలెంట్ చూసి అందరూ ఫిదా అవుతున్నారు అని చెప్పాలి. ఎంతో చాకచక్యంగా ఎవరి సహాయం లేకుండానే చేపలు పట్టేందుకు వెళ్లిన చిన్నోడు ఏకంగా రెండు భారీ చేపలను పట్టి బస్తాలో వేసుకున్నాడు. ఎక్కువ లోతులేని చిన్న గుంట దగ్గరికి వెళ్తాడు బాలుడు. అయితే నీటి గుంట ఒడ్డున మాంజా ఉన్న రెండు చెక్కలను భూమిలో పాతుతాడు. ఆ తర్వాత పిండి ముద్దలు వేసి గాలానికి కట్టి దానిని నీళ్లల్లో విసిరేస్తాడు. ఇక ఆ ఒడ్డుకు ఓపిగ్గా కూర్చుంటాడు. కాసేపటికి మాంజా కదలడం మొదలవుతుంది. దీంతో ఆ బాలుడు ఆ గాలాన్ని ఒడ్డుకు లాగుతాడు. ఇక ఆ గాలానికి రెండు పెద్ద చేపలు కూడా వస్తాయి. దీంతో ఇక తన వెంట తెచ్చుకున్న బస్తాలో ఆ చేపలను వేసుకుంటాడు. చూసే వాళ్లకు ఇది చిన్న విషయమే అయినప్పటికీ చేపలను పట్టేందుకు అతను వేసిన ఐడియా మాత్రం అదిరిపోయింది అని నేటిజన్స్ కామెంట్లు చేస్తున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: