ఎప్పుడు లేని విధంగా 210 మండలాలలో తీవ్రమైన వడగాలుడు వీచినట్టుగా వాతావరణ శాఖ గుర్తించినట్టు సమాచారం అంటే దాదాపుగా రాష్ట్రంలో 31% మండలాలు నిప్పుల గుండాన్ని తలపించాయి మరో రెండు వందల ఇరవై మండలాలలో వడగాలులు పెరిగే అవకాశం ఉన్నట్లుగా తెలుస్తోంది. మొత్తం మీద చూస్తే 64% పైగా మండలాలలోని ప్రజలు ఈ వేడితో చాలా ఉక్కిరిబిక్కిరి అవుతున్నారట. అందుచేతనే రెండు తెలుగు రాష్ట్రాలలోని ప్రజలు ఇవాళ రేపు కూడా ఉదయం పూట సాయంత్రం పూట మాత్రమే బయటికి రావాలని సూచిస్తున్నారు వాతావరణ శాఖ. ముఖ్యంగా ఈరోజు రేపు వేడిగాలు తీవ్రత పెరిగే అవకాశం ఉన్నట్లు తెలియజేస్తోంది.
ఈ ఏడాది 268 మండలాలలో తీవ్రంగా అధిక స్థాయిలో వడగాలుడు వీచే అవకాశం ఉన్నట్లు విపత్తు నిర్వహణ సంస్థ తెలియజేస్తోంది. నిన్నటి రోజున అనకాపల్లి జిల్లాలో 23 మండలాలుల అత్యధిక ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి అలాగే విశాఖపట్నం జిల్లాలో ఎనిమిది మండలాలలో తీవ్రమైన వడగాలుడు వీచినట్టు తెలియజేస్తున్నారు. ఏపీలో ఏలూరు జిల్లాలోని పంగిడిగూడెంలో 44.5 , ప్రకాశం కూచి కూరిచేడులో 44.2 డిగ్రీల గరిష్ట ఉష్ణోగ్రతలు నమోదయ్యాయట. ఇవే కాకుండా పలుచోట్ల అత్యధికంగా ఉష్ణోగ్రతలు నమోదైనట్టుగా తెలుస్తోంది. ఈ అధిక వేడికి అటు రైతులు, పౌల్ట్రీ ఫామ్ హౌస్లు, సామాన్య ప్రజలు సైతం పలు రకాల ఇబ్బందులను ఎదుర్కొంటున్నారు.
క్లిక్ చేసి ఇండియాహెరాల్డ్ వాట్సాప్ చానెల్·ను ఫాలో అవ్వండి