తెలంగాణలో ఈరోజు ఓట్ల పండుగ మొదలైంది. ఓట్లు వేసే వారంతా ఓటింగ్ పోలింగ్ బూత్ దగ్గరకి తరలి వస్తున్నారు.. అయితే చాలామందికి ఇంటికి ఓటర్ స్లిప్పులు రాలేదని ఇబ్బంది పడుతూ ఉంటారు. అయితే ఇలాంటి విషయాలకు డోంట్ వర్రీ అంటోంది ఎన్నికల సంఘం.. వాస్తవానికి ఎన్నికల సంఘం ద్వారా మాత్రమే ఈ పోలింగ్ స్లిప్పులను సైతం పంపిణీ చేస్తూ ఉంటారు. అయితే ఓటర్లను ఆకర్షించే క్రమంలో పోటీలో నిలబడ్డ అభ్యర్థులు కూడా ఓటర్లను స్లిప్పులను సైతం పంపిణీ చేస్తూ ఉంటారు.


గతంలో మాదిరిగానే ఆటు అభ్యర్థులు ఇటు ఎన్నికల సంఘాలు కూడా ఈ పోలింగ్ స్లిప్పులను సైతం సక్రమంగా పంపిణీ చేయకపోవడంతో తమ ఓటు హక్కు ఎక్కడ ఉందో తెలుసుకునేందుకు ప్రజలు చాలా ఇబ్బందులను ఎదుర్కొంటున్నారు. అయితే కేవలం మొబైల్ మీ చేతిలో ఉంటే చాలు సులువుగా పోలింగ్ స్టేషన్ ని సైతం తెలుసుకోవచ్చని తెలుస్తోంది. ఇందుకోసం పలు రకాల మార్గాలు ఉన్నాయట.పోలింగ్ కేంద్రాలకు వెళ్లే ముందు ఓటర్లు తాము ఓటు వేయవలసిన బూతులు సైతం ఎక్కడ ఉందో తెలుసుకోవడానికి... గతంలో వేసినటువంటి పోలింగ్ బూత్ ఉంటుందని ధీమాతో ఉంటారు.

అయితే దీనివల్ల ఒక్కొక్కసారి ఇబ్బందులు కూడా ఎదుర్కోవాల్సి వస్తుంది. మీ ఓటర్ కార్డు నెంబరు తెలుసుకోవాలంటే.. 1950,92117,28082 వంటి నెంబర్లకు కాల్ చేస్తే చెబుతారట. పోలింగ్ కేంద్రం వివరాలను కూడా ఎస్ఎంఎస్ రూపంలోనే తెలియజేస్తాయి. 24 గంటలు పనిచేసే ఈ టోల్ ఫ్రీ నెంబర్లకు కాల్ చేస్తే చాలు తెలుసుకోవచ్చు. ఒకవేళ ఇదే కాకుంటే ఎలక్షన్ కమిషన్కు చెందిన ఓటర్  హెల్ప్ లైన్ యాప్ ను కూడా డౌన్లోడ్ చేసుకొని అందులో డీటెయిల్స్ మనం పొందవచ్చు. ఓటర్ స్లిప్పు లేని పక్షంలో ఏదైనా కేవైసీ డాక్యుమెంట్ ని చూపించి కూడా ఓటు వేయవచ్చని అధికారులు తెలుపుతున్నారు. ముఖ్యంగా ఆధార్ కార్డు, పాస్పోర్ట్, డ్రైవింగ్ లైసెన్స్ ,ప్రభుత్వ రంగ స్థలాలలో ఏదైనా గుర్తింపు కార్డు, పోస్ట్ ఆఫీస్ జారీచేసిన పాసుబుక్కు ఏదో ఒకటి తో ఓటు వేయవచ్చు.

మరింత సమాచారం తెలుసుకోండి: