
కానీ ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ గా మారిపోయిన వీడియో చూస్తే మాత్రం ఏకంగా చిరుత పులి లాంటి ప్రమాదకరమైన జంతువుల్లో సైతం జాలి గుండె ఉంటుందని భావన ప్రతి ఒక్కరికి కూడా కలుగుతూ ఉంటుంది అని చెప్పాలి. ఎందుకంటే ఏకంగా జింకలను వేటాడి తినే ఒక చిరుత పులి ఒక జింక పిల్లను ఏకంగా హైనా బారి నుంచి కాపాడింది. ఈ వీడియో చూసి నేటిజన్స్ అందరూ కూడా షాక్ అవుతున్నారు అని చెప్పాలి. చిరుత పులి జింక పిల్ల ఒకదాని దగ్గర ఒకటి నిలబడి ఉంటాయి. అయితే జింక పిల్ల చిన్నది కావడంతో ఇక ఎంతో భయపడిపోతూ ఉంటుంది.
పక్కనే ఉన్న చిరుత పులి దానిని వేటాడేందుకు ఎక్కడ ఆసక్తిని చూపించదు. కానీ పరిసరాలను గమనిస్తూనే ఉంటుంది. అయితే ఇక చిరుత పులి కంటికి సడన్గా ఒక హైనా కనిపించింది. ఇక హైనా జింక వద్దకు దూసుకు వస్తూ ఉంది. దీంతో ఒక్కసారిగా చిరుత పులి అప్రమత్తమైంది. వెంటనే ఆ చిట్టి జింక పిల్ల మెడను పట్టుకుని ఏకంగా చెట్టు మీదికి ఎక్కుతుంది. చిరుతపులిలా హైనా చెట్టు మీదకి ఎక్కలేదు. కాబట్టి చివరికి నిరాశ చెందుతుంది. ఇలా ఏకంగా చిరుత పులి కూడా చిన్నారి జింక పిల్ల విషయంలో జాలి చూపించింది అంటూ ఎంతో మంది నేటిజన్స్ కామెంట్ చేస్తున్నారు.