ఇప్పుడు ఎక్కడ చూసినా సరే అందరు దీని గురించే మాట్లాడుకుంటున్నారు.  73 ఏళ్ల మహిళ గర్భంలో 30 ఏళ్లుగా కల్సి ఫైడ్ ఫీటస్ అంటే రాతి బిడ్డ ఉన్నట్లుగా గుర్తించిన డాక్టర్లు షాక్ అయిపోతున్నారు.  దీనికి సంబంధించి డాక్టర్లు రకరకాలుగా పరిశోధనలు చేస్తున్నారు.  అంతేకాదు ఇది ఒక అరుదైన పరిస్థితి అని పిలుస్తారు అని క్లారిటీ ఇచ్చారు. ఇప్పటి వరకు సుమారు ఇలాంటి కేసులు ప్రపంచ వ్యాప్తంగా కేవలం 300 మాత్రమే రిజిస్టర్ అయ్యాయి అని చెప్పుకొస్తున్నారు. దీనికి సంబంధించిన పూర్తి వివరాలు ఇక్కడ చదివి తెలుసుకుందాం..!!


రీసెంట్గా సోషల్ మీడియాలో ఓ వార్త బాగా హాట్ టాపిక్ గా వైరల్ అయింది . ఓ మహిళ గర్భం విఫలమై ఆ ఫిటస్ శరీరంలో అలానే ఉండిపోయింది . అది రాతిగా మారిపోయింది . ఇదే విషయాన్ని డాక్టర్లు రీసెంట్గా కన్ఫామ్ చేశారు.  ఈ ఘటన అల్జీరియాలో జరిగినట్లు తెలుస్తుంది . దినిని లిధోఫిడియా అని చెప్పుతున్నారు డాక్టర్లు. ఇది  చాలా అరుదుగా కనిపిస్తుందని అంటున్నారు.  గర్భం గర్భాశయంలో కాకుండా కడుపులో ఏర్పడే పద్ధతినితో లిధోఫిడియా  అంటారు అని .. ఫిటస్ కి తగిన రక్త సరఫరా లేకపోవడం వల్ల గర్భం విఫలమవుతుంది అని .. అంతేకాదు శరీరానికి ఫిటస్ సహజంగా బయటకు పంపే మార్గం లేకపోతే శరీరం రక్షణాత్మక చర్యగా ఫిట్టర్స్ ని శిలజంగా మార్చేస్తుంది అని డాక్టర్లు చెబుతున్నారు.



మన బాడీలోని రోగనిరోధక వ్యవస్థ ద్వారా ఈ ప్రక్రియ జరుగుతుంది అంటూ కూడా వారు చెప్తున్నారు. శరీరానికి ప్రమాదకరమైన అంశాలు ప్రభావాన్ని తగ్గించడమే లక్ష్యంగా ఈ ప్రాసెస్ జరుగుతుంది అంటూ కూడా క్లారిటీ ఇస్తున్నారు . 2013లో కూడా కొలంబియాలో ఇలా జరిగింది అంటూ గుర్తు చేస్తున్నారు . అంతేకాదు ప్రపంచవ్యాప్తంగా కేవలం 300 సార్లు మాత్రమే ఇలాంటి కేసులు నమోదైనట్లు మెడికల్ డేటా చెబుతుంది . ఇంతకాలం ఆ మహిళకు ఎలాంటి ఇబ్బంది కలగలేదా..? ఇది నిజంగా నిజమైన ఎలా సాధ్యమవుతుంది ..?? కామెంట్స్ పెడుతున్నారు . అంతేకాదు సిటీ స్కాన్ ఫొటోస్ చూసి షాక్ అయిపోతున్నారు. కడుపులో ఫిటస్ ఇలా మారిపోతుందా ..? ఇది నిజంగా చాలా చాలా రేర్ మూమెంట్ అంటూ ఫొటోస్ ని వైరల్ చేస్తున్నారు . సోషల్ మీడియాలో ఇప్పుడు ఇదే న్యూస్ బాగా వైరల్ గా మారింది..!!

మరింత సమాచారం తెలుసుకోండి: