ఈ ప్రపంచంలో ప్రతి ఒక్కరికి కావలసింది గెలుపు, విజయం. ఈ రెండూ లేకపోతే నిజం గానే లైఫ్ లేదు ఉన్న వ్యర్థమే. ఒక మనిషి పుట్టాక ఏదో ఒకటి సాధించాలని అనుకోవాలి. అలా సాధిస్తేనే తన పుట్టుకకు ఒక అర్ధం ఉంటుంది. అయితే ఈ గెలుపు అంత సులభంగా ఎవరికీ దక్కదు. అది జగమెరిగిన సత్యం . దాని కోసం ఎన్నో త్యాగాల చేయాలి. అహర్నిశలు కష్టపడాలి. కానీ కొన్ని సార్లు మాత్రం మనము ఎంత శ్రమించినా అనుకున్న ఫలితం దక్కకపోవచ్చు. ఇటువంటి పరిస్థితిలో ఎలా ఉంటుందంటే ఏంటి ఇంత కష్టపడినా మనము అనుకున్నది సాధించలేకపోయామే అన్న నిరాశ లోకి వెళ్ళి పోతారు కొందరు. అప్పుడు నేనింతేనా నా వాళ్ళ ఏమీ కాదా అని నెగటివ్ గా ఆలోచిస్తూ ఉంటారు.

అయితే మన వాళ్ళు కష్ట పడిన సమయంలో ఏమైతే చిన్న చిన్న సంతోషాలు, సరదాలు కోల్పోయారో వాటన్నింటినీ తలుచుకుంటూ బాధపడతారు. ఇటువంటి వారంతా కొన్ని విషయాలు తెలుసుకోవలసిన అవసరం ఉంది. మనము ఎన్ని కష్టాల్లో ఉన్నా, ఎంత బిజీగా ఉన్నా కొన్ని సంతోషాలను మరియు ఆనందాలను అనుభవిస్తూ ఉండాలి. అప్పుడే వారు పడుతున్న కష్టాన్ని సైతం అది మరిచి పోయేలా చేస్తుంది. అయితే చాలా మంది మాత్రం మనము అనుకున్న టార్గెట్ అయిన తర్వాతే అన్నీ అని మంకు పట్టుకుకూర్చుంటారు. ఇలాంటి పద్ధతి సరైనది కాదు.

విజయం సాధించిన తర్వాతే అన్ని సంతోషాలు అనుకుంటే, ఇక జీవితంలో చాలా మందికి సంతోషం దూరమైనట్టే. మీరు గెలుపు కోసం చేసే పోరాటంలో సంతోషాన్ని వెతుక్కోవాలి. ఇకనైనా ఈ విషాయంలో మీ వైఖరిని మార్చుకోండి. ప్రతి నిముషం సంతోషంగా ఉండండి. గెలుపు ఎక్కడో లేదు, మీ సంతోషంలోనే ఉందని గ్రహించండి. మీకు దగ్గరయ్యే ఆనందాలను లక్ష్యం పేరుతో దూరం చేసుకోకండి.

 


మరింత సమాచారం తెలుసుకోండి: