మార్గం ఎదురుగా కనిపిస్తున్నప్పుడే కాదు అన్ని దారులూ మూసుకు పోయి అంధకారంగా మారినా సరే మీలో ఉన్న ఆత్మ విశ్వాసం మరియు దైర్యం ఏ మాత్రం తగ్గకూడదు. చేతిలో అవకాశం ఉన్నప్పుడు ఎవరైనా అనుకున్నది సాధిస్తారు. అవకాశం లేనప్పుడు కూడా నమ్మకాన్ని కోల్పోకుండా పట్టుదలతో అనుకున్నది సాధించిన వారు మరింత గుర్తింపును అందుకుంటారు. ఉదాహరణకు ఇద్దరు స్నేహితులు ఉన్నారు, వారిద్దరిది ఒకటే గమ్యం, ఒకటే లక్ష్యాన్ని ఎంచుకున్న ఆ ఇద్దరు స్నేహితులు ఎవరి దారుల్లో వారు తమ లక్ష్యం కోసం ప్రయాణాన్ని మొదలు పెట్టారు. అయితే వారిలో ఒకరికి అదృష్టం కలసి వచ్చి వరుస అవకాశాలు అందగా అనుకున్నది సాధించాడు. తన లక్ష్యాన్ని పరిపూర్ణం చేసుకున్నాడు.

కానీ తన స్నేహితుడు మాత్రం ఎదురైన సమస్యలతో పోరాడలేక.. అవకాశాలు అందక నిరాశతో కుంగిపోయాడు. అలాంటి సమయంలో తన స్నేహితుడు అందుకున్న విజయాన్ని ఆ విజయం వలన అందిన ఆనందాన్ని తన మిత్రుడితో పంచుకోవడానికి అతడి దగ్గరకు చేరుకున్నాడు. కానీ బాధతో కుంగిపోతున్న తన స్నేహితుడిని చూసి ఆందోళన చెంది అతడిని తిరిగి మామూలు వ్యక్తిని చేయాలని , తన స్నేహితుడు కూడా విజయంలో రుచిని తెలుసుకోవాలని అనుకున్నాడు. అందుకు అనుగుణంగా తన స్నేహితుడికి  ఏ విధంగా చేస్తే విజయం అందుకోగాలమో వివరించి, ప్రతి విషయాన్ని అర్థమయ్యేలా చెప్పి, తనలో స్ఫూర్తిని నింపి ముందుకు నడిపించాడు.

అయితే ఆ తర్వాత తన స్నేహితుడు కూడా ఇవైజయం పొందగలిగాడు. ఇలా వెనకుండి తన స్నేహితుడి విజయానికి కారణమయ్యాడు.  అలా ఆ వ్యక్తి మొదట నిరాశతో నిలిచిపోవడంతో విజయం అందలేదు, ఎపుడైతే తన స్నేహితుడు తనలో దైర్యన్ని నింపి, నమ్మకాన్ని పెంచాడో మరింత దృఢంగా ప్రయత్నించి లక్ష్యాన్ని చేరుకున్నాడు. అయితే ఇలా ప్రతిసారీ మనకు ఎవరో ఒకరు అండగా నిలబడాలని లేదు, సంకల్పం దృఢం చేసుకుని మీపై మీరు నమ్మకం ఉంచి గట్టిగా ప్రయత్నిస్తే తప్పక విజయాలు అందుకుంటారు.

మరింత సమాచారం తెలుసుకోండి: