ప్రభుత్వాలు ఆడపిల్ల పై, మహిళల పై జరుగుతున్న అన్యాయా లను తగ్గించాడని ఎన్నో రకాల చట్టాలను వెలుగు లోకి తీసుకొస్తున్న కూడా ఎక్కడా మృగాళ్ల ఆగడాలు తగ్గలేదు. మహిళలపై అన్యాయాలు దాడులు కూడా ఎక్కడ తగ్గలేదని అర్థమవుతుంది. నిన్న కాక మొన్న జరిగిన దిశ కేసు అందరిని కదిలించి వేసింది. ఆ ఘటన పూర్తిగా మరువక ముందే మరో ఘటన వెలుగు లోకి వచ్చింది.  


వివరాల్లోకి వెళితే .. హైదరాబాద్‌ లో మహిళల పై అఘాయిత్యాలకు అడ్డుకట్ట పడటం లేదు. నిత్యం ఎక్కడో చోట మహిళలు, యువతులు, చిన్నారులపై దాడులు, అత్యాచారాలు జరుగుతూనే ఉన్నాయి. తాజాగా నిత్యం రద్దీగా ఉండే బంజారాహిల్స్‌ ప్రాంతంలో ఇద్దరు యువకులు తల్లీ కూతుళ్లపై లైంగిక వేధింపులకు పాల్పడ్డారు.


బంజారాహిల్స్‌ రోడ్‌ నెం 13లోని గౌరీశంకర్‌ కాలనీ లో నివసిస్తున్న లక్ష్మి అనే వివాహిత తన ఏడేళ్ల కూతురితో కలిసి ఆదివారం రాత్రి 11 గంటల సమయం లో వైట్‌హౌస్‌ మీదుగా గౌరీశంకర్‌ నగర్‌ వైపు నడుచుకుంటూ వెళ్తోంది. వైట్‌హౌస్‌ వెనకాల రోడ్డు వద్దకు రాగానే ఇద్దరు యువకులు స్కూటీ మీద వచ్చి అడ్డగించారు. వీరిలో ఓ యువకుడు ఆమె కూతురును బలవంతంగా లాక్కుని వెళ్లిపోగా.. మరో యువకుడు మహిళపై అసభ్యంగా ప్రవర్తించాడు.


అయితే మహిళ పెద్దగా అరవడంతో ఆమెను పక్కకు తోసేసి అతను అక్కడి నుండి ఉడాయించాడు. కూతురిని ఎక్కడికి తీసుకెళ్లారో అంటూ ఆమె ఇంటికి వెళ్ళింది. తీరా చుస్తే కూతురు ఇంట్లోనే ఉండటంతో ఎవరో తెలిసిన వాళ్ళ పనే అని పోలీసులకు పిర్యాదు చేసింది.  పోలీసులు నిందితులపై ఐపీసీ 354, 323, 341 సెక్షన్ల కింద క్రిమినల్‌ కేసు నమోదు చేసి పోలీసులు గాలింపు చేపట్టారు. ఇలాంటి ఘటనలు అడ్డుకట్టలు వేయాలని సీఎం ను డిమాండ్ చేస్తున్నారు. 

మరింత సమాచారం తెలుసుకోండి: