అన‌సూయ ఆశ‌ల‌కు ర‌మ్య‌కృష్ణ గండికొట్టింది. ఈ అందాల భామకు న‌ట‌న ప‌రంగా ప్రూవ్ చేసుకునేందుకు ఓ మంచి పాత్ర వ‌చ్చినంటే వ‌చ్చి...చివ‌రికీ సీనియ‌ర్ హీరోయిన్ ర‌మ్య‌కృష్ణ ఒడిలోకి చేరింది. దీంతో ఈ హాట్ యాంకర్ కాస్త నిరాశ చెందుతోందంట‌. త‌మ అభిమాన న‌టిని ఓ డిఫంరెంట్ యాక్టింగ్ క్యారెక్ట‌ర్‌లో చూద్దామ‌నుకున్న ఆమె అభిమానులు కూడా ఏంటీ ఇలా జ‌రిగింది మేడమ్‌కు కూడా తెగ బాధ‌ప‌డిపోతున్నారంట‌. భీష్మ లాంటీ సూపర్ హిట్ తర్వా త హీరో నితిన్హిందీ సినిమా తెలుగు రీమేక్‌లో నటిస్తున్న విష‌యం తెలిసిందే. హిందీలో ఆయుష్మాన్ ఖురానా హీరోగా సూపర్ సక్సెస్ అయిన ‘అంధాధున్’ ను నితిన్ తెలుగు రీమేక్‌లో న‌టిస్తున్నాడు.

 

 అందులో భాగంగా ఈ సినిమా పూజా కార్యక్రమాలను ఇటీవలే జరుపుకుంది. ఈ చిత్రాన్ని యంగ్ అండ్ డైన‌మిక్‌ మేర్లపాక గాంధీ డైరెక్ట్ చేస్తున్నాడు. శ్రేష్ఠ్ మూవీస్ పతాకంపై నితిన్ తండ్రి సుధాకర్ రెడ్డి నిర్మిస్తున్నాడు. ఈ సినిమాలో ప్ర‌తినాయిక పాత్ర‌కు ముందు హిందీలో న‌టించిన ట‌బునే తీసుకోవాల‌ని భావించార‌ట‌. పారితోషికం విష‌యంలోనో..మ‌రెందుక‌నో మొత్తానికి ట‌బును సంప్ర‌దించలేద‌ని స‌మాచారం. ఇక ఆ పాత్ర‌కోసం వెతుకుతున్న వారికి అన‌సూయ రంగ‌మ్మ‌త్త మెద‌ళ్ల‌లో త‌ట్టిందంట‌. నెగిటివ్ అండ్ బోల్డ్‌గా క‌నిపించేందుకు అన‌సూయ స‌రిగ్గా స‌రిపోతుంద‌ని డైరెక్ట‌ర్ గాంధీ కూడా భావించాడ‌ట‌. 

 

అయితే  అంతటి వెయిట్ ఉన్న పాత్ర కూడా అన‌సూయ కూడా వెంట‌నే ఒకే చెప్పేసిందంట‌. ఈ విష‌యం బ‌య‌ట‌కు రావ‌డంతో  ఆమె అభిమానులు కూడా అదిరిపోయే పాత్రలో అభిమాన యాంకర్ కనిపించనుందని చాలా సంతోషించారు. అయితే తాజాగా తెలుస్తున్న స‌మాచారం ప్ర‌కారం ఆ పాత్ర‌కు రమ్యకృష్ణను తీసుకోవాలని అనుకుంటున్నారట దర్శకనిర్మాతలు. ఇలా ఒక్క‌సారిగా చిత్ర‌బృందం ప్లేటు ఫిరాయించేదేంటి అంటూ అన‌సూయ బుంగ‌మూతి పెట్టుకుందంట‌.అన‌సూయ‌కు మంచి పాత్ర పోయిందని ఆమె అభిమానులు నిరాశ చెందుతున్నారట. ఇక ఈ సినిమాతో పాటు మరో సినిమాలోను నటిస్తున్నాడు నితిన్. రంగ్ దే అనే పేరుతో తెరకెక్కుతోన్న ఈ సినిమాలో కీర్తి సురేష్ హీరోయిన్‌గా చేస్తోంది. ఈ సినిమాకు సంబందించిన ఫస్ట్ లుక్ ఇటీవలే విడుదలై మంచి ఆదరణ పొందింది.

 

 

 

క‌రోనాపై సెల్ఫ్ అసెస్‌మెంట్ టెస్ట్‌ :

NIHWN  వారి సంజీవ‌న్ మీకు క‌ల్పిస్తోన్న ఈ అవ‌కాశం.. క‌రోనాపై ఈ క్రింది లింకుల ద్వారా యాప్ డౌన్‌లోడ్ చేసుకుని సెల్ఫ్ అసెస్‌మెంట్ చేసుకోండి.

Google: https://tinyurl.com/NIHWNgoogle

apple : https://tinyurl.com/NIHWNapple

 

మరింత సమాచారం తెలుసుకోండి: