గర్భిణీ స్త్రీలకు కడుపుతో ఉన్నపుడు సరైన  పోషక ఆహారం తీసుకోవాలి.ఎందుకంటే తినేఆహారంలోని తల్లికి బిడ్డకి ఇద్దరికి సరిపడా పోషకాలు ఉండేలాగా చూసుకోవాలి.కడుపుతో ఉన్న మహిళలు రక్తం పడడానికి ఫోలిక్ ఆసిడ్ చాలా అవసరం.ఫోలిక్ ఆసిడ్’ని ఫోలేట్ అని కూడా అంటారు.ఇది పిండాబివృద్దికి మరియు ఎముకల పెరుగుదలకు తప్పని సరిగా అవసరమయ్యే విటమిన్. ఇది తల్లి మోసే శిశువు ఎముకల పెరుగుదలకు మరియు బలానికి చాలా అవసరం.గర్భ సమయంలో ఫోలిక్ ఆసిడ్’ని అందించే ఆహారపదార్ధాలను తినటం వలన మీకు మరియు మీ కడుపులో పెరిగే శిశువు ఆరోగ్యంగా ఉంటుంది. గర్భం ధరించిన స్త్రీ తొమ్మిది నెలల గర్భ సమయంలో ఫోలిక్ ఆసిడ్ తీసుకోవడం అనేది చాలా ముఖ్యమైన విషయం.  



అందువల్లనే గర్భ సమయంలో ఫోలిక్ ఆసిడ్ ఎక్కువగా ఉన్న మందులను మరియు ఆహారాన్ని తీసుకోమని వైద్యులు సలహా ఇస్తుంటారు.అసలు ఫోలిక్ ఆసిడ్ తీసుకోవడం వల్ల ఉపయోగాలు ఏంటో తెలుసుకుందాం.. !!ఇది ప్రసవ సమయంలో వచ్చే ఇబ్బందులను తగ్గిస్తుంది మరియు వెన్నుముక నిర్మాణంలోని లోపాలను తొలగించి ప్రసవాన్ని సులభతరం చేస్తుంది.జన్యు పరంగా ముఖ్యమైన dna అభివృద్దికి మరియు నిర్మాణానికి సహాయపడుతుంది. ఎర్ర రక్త కణాల ఉత్పత్తికి ఫోలిక్ ఆసిడ్ తప్పకుండా అవసరం.స్త్రీలు వారి గర్భ మరియు ప్రసవ సమయంలో ఎక్కువ రక్తం అవసరం.ఒకవేళ గర్భిణికి సహజ ప్రసవం అవ్వకపోతే ఆపరేషన్ చేయాలిసిన పరిస్థితి వస్తే రక్తం చాలా పోతుంది. అలాంటపుడు రక్తహీనత ఎక్కువ అవుతుంది.




 అందుకనే కడుపుతో ఉన్నపుడు ఫోలిక్ ఆసిడ్ తప్పకుండా తీసుకోవాలి. గర్భం ఉన్న సమయంలో ఫోలేట్ లోపంతో పాటూ, ఐరన్ లోపం ఉన్నట్లయితే ఆమెకి అనీమియా అనగా అలసటగా ఫీల్ అవుతారు. ఇలా గర్భం ఉన్న స్త్రీకి అనిమీయా ఉన్నట్లయితే,తలనొప్పి,జీర్ణక్రియతో భాదపడతారు మరియు ఎక్కువ చిరాకుగా ఫీల్ అవుతారు. అంతేకాకుండా కాకుండా పిండం అభివృద్దిలో కుడా లోపాలు జరుగుతాయి.అందుకని ఫోలిక్ ఆసిడ్ ఉన్న ఆహార పదార్ధాలు తింటూ ఉండాలి. పచ్చని ఆకు కూరలు ఎక్కువగా ఫోలిక్ ఆసిడ్’ని కలిగి ఉంటాయి.తృణ దాన్యాలు ముఖ్యంగా పాస్తా, పిండి మరియు రైస్’లలో ఎక్కువ గా ఫోలిక్ ఆసిడ్ ఉంటుంది. కావున గర్భం ఉన్న ఆడ వాళ్ళు ఎక్కువగా ఫోలిక్ ఆసిడ్ ఉండే తాజా పండ్లు , సలాడ్స్,ఆకుకూరలు, క్యారెట్స్ ఎక్కువగా తినాలి..

Powered by Froala Editor

మరింత సమాచారం తెలుసుకోండి: