అలాగే చర్మ సమస్యలను కలిగి ఉన్నపుడు మీరు పడుకోటానికి ముందుగా ప్రభావిత ప్రాంతాలలో ఆలివ్ ఆయిల్’తో మసాజ్ చేయండి. అంతేకాకుండా, ఆలివ్ ఆయిల్, కొబ్బరి నూనె రెండింటిని కలిపి వాడటం వలన మంచి ఫలితాలను పొందుతారు.అలాగే వేప చెట్టు ఉత్పత్తులు యాంటీ బ్యాక్టీరియా, యాంటీ వైరల్, యాంటీ ఫంగల్ గుణాలను కలిగి ఉంటాయి. ఈ గుణాలను కలిగి ఉండటం వలన చర్మానికి కలిగే వివిధ రకాల సమస్యలకు, మొటిమలకు, గజ్జి, తామర వ్యాధులను తగ్గించటానికి వేపను వాడుతుంటారు.తేనే చాలా రకాలుగా చర్మానికి ఉపయోగపడుతుంది.
తేనె సహజ సిద్దమైన ఇంట్లో ఉండే ఔషదం ముఖ్యంగా మొటిమలు, చర్మం పగిలినపుడు వాటిని తగ్గించే ఔషదంగా చెప్పవచ్చు. మీ చర్మ సమస్యలను తగ్గించటానికి తేనే, దాల్చిన చెక్క పొడిని కలిపిన మిశ్రమాలను చర్మానికి వాడండి.అలాగే నిమ్మకాయ విటమిన్ ‘C’లను ఎక్కువగా కలిగి ఉండటం వలన శుభ్రపరిచే గుణాలను కలిగి ఉంటుంది, చర్మ సమస్యలకు ఇది శక్తి వంతంగా పని చేస్తుంది. నిమ్మకాయ నుండి చిన్న ముక్కను కత్తిరించి, ప్రభావిత ప్రాంతంలో రాయటం వలన మీరు చర్మ సమస్యల నుండి ఉపశమనం పొందుతారు.
క్లిక్ చేసి ఇండియాహెరాల్డ్ వాట్సాప్ చానెల్·ను ఫాలో అవ్వండి