ఒకప్పుడు స్టార్ హీరోయిన్ గా టాలీవుడ్ ను ఒక ఊపు ఊపిన నటి నగ్మా వయసు ఇపుడు 45 ఏళ్లు దాటేసింది. అయినా పెళ్లి చేసుకోకుండా సింగిల్ గానే జీవితం సాగిస్తున్నారు. ఈమె అనుకుని ఉంటే గొప్ప గొప్ప వారిని పెళ్ళి చేసుకుని ఈపాటికి ఒక మంచి ఫ్యామిలీ ని కలిగి ఉండేది. కానీ ప్రేమలో ఒకటి కాదు, రెండు కాదు ఏకంగా నాలుగు సార్లు మోసపోవడంతో ఆమెకి పెళ్లిపై విరక్తి పుట్టిందో ఏమో కానీ అలా సింగిల్ గా మిగిలిపోయింది. నిజానికి ఈమె గాఢంగా ప్రేమించిన వారంతా కూడా ఆల్రెడీ పెళ్లయిన వ్యక్తులే కావడం గమనార్హం. ఇది పూర్తిగా నిజమే అని చెప్పలేం కానీ అప్పట్లో ఈ నలుగురి వ్యక్తులతో ఘాడంగా ప్రేమలో నగ్మా మునిగితేలారని అయితే వారితో ఆ తర్వాత బ్రేకప్ లు కూడా జరిగాయని చాలానే వార్తలు వినిపించాయి. అలా ఇంకో ఇంకో ఛాన్స్ అని తనకి తాను చెప్పుకుంటూ ఎంతో మనస్పూర్తిగా ఆ నలుగురిని నమ్మిన నగ్మా వారు మోసం చేయడంతో నేడు ఒంటరిగా మిగిలిపోయారు అని ఇండస్ట్రీలో వినిపిస్తున్న మాట. ఇంతకు వారు ఎవరంటే..!!

నగ్మా మొదట కోలీవుడ్ సీనియర్ స్టార్ హీరో అయిన శరత్‌కుమార్‌ను ప్రేమించింది అనే వార్తలు అప్పట్లో వెల్లువెత్తాయి. వీరికి సంబంధించిన కొన్ని ఫోటోలు కూడా వైరల్ అయ్యాయి. అయితే శరత్ కుమార్ కు అప్పటికే పెళ్లయ్యి పిల్లలు కూడా ఉన్నారు. అయినా శరత్‌కుమార్ ఎందుకు ప్రేమించింది అన్నది తెలియదు కానీ...కొన్నాళ్ళ తర్వాత  శరత్‌కుమార్ నగ్మాకు పెద్దగా ఇంపార్టెన్స్ ఇవ్వకుండా దూరం పెట్టడంతో ఆయనకు దూరం అయ్యింది.


ఆ తర్వాత భోజ్‌పురి హీరోలు అయిన మనోజ్‌ తివారి, రవికిషన్ సింగ్‌తో ప్రేమలో పడింది అని కూడా వార్తలు గట్టిగా వినిపించాయి. మనోజ్ తివారికి కూడా ఆల్రెడీ పెళ్ళై పిల్లలు కూడా. అయితే ఇతడితో నగ్మా చెట్టాపట్టాలేసుకుని తెగ తిరిగేసింది. కానీ కొన్నాళ్లకు ఈ హీరో కూడా నగ్మ ను పక్కన పెట్టడం తో బ్రేకప్ అయ్యింది .

ఇక చివరగా నగ్మా ఇండియన్ క్రికెట్ జట్టు మాజీ కెప్టెన్ గంగూలీతో ప్రేమలో పడగా అది కూడా బెడిసి కొట్టింది. గంగూలీకి కూడా అప్పటికే పెళ్లై పిల్లలు. నగ్మా అతడి ప్రేమలో పడింది.  ఎక్కడ చూసినా అప్పట్లో వీరే కనిపించేవారు.  ఒకానొక సమయం లో గంగూలీ భార్య డోనాకు దూరంగా నగ్మాతో ఉండిపోయాడు. దాంతో వీరిద్దరూ పెళ్లి చేసుకోవడం ఖాయం అనుకున్నారు కానీ ఆ తర్వాత గంగూలీ ఫ్యామిలీ నే ముఖ్యం అనుకుని నగ్మా ను వదిలించుకోవడం తో....ప్రతి సారి తనకి మోసమే ఎదురవుతుందని విరక్తి చెందిన నగ్మా పూర్తిగా పెళ్లి గురించి గాలికి వదిలేసింది అని అంటుంటారు.

మరింత సమాచారం తెలుసుకోండి: