కార్యనిర్వహణాధికారి కుర్చీలో కూర్చుని అతి తక్కు

ప్రముఖ రచయిత, శ్రీశైలదేవస్థానం పూర్వ ప్రత్యేక సలహాదారులు పురాణపండ శ్రీనివాస్ పరమాద్భుత మంత్ర విద్యలతో, స్తోత్ర విద్యలతో భక్తి నిండిన హృదయాలకు ' శ్రీమాలిక ' మహా గ్రంథ పరిమళాన్ని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు, ఉప ముఖ్యమంత్రి కొణిదెల పవన్ కళ్యాణ్ ల సారధ్యంలో రాష్ట్రం ప్రగతి పధంలో దూసుకుపోయి, సుసంపన్నమవ్వాలనే ఆకాంక్షిస్తూ చంద్రబాబు, పవన్ కళ్యాణ్ ల చిత్రాలను ముద్రించి మరీ శ్రీమాలిక బుక్ ను అద్భుతంగా అపూర్వంగా అందించడం విశేషం. ఈ మొత్తం శ్రీ కార్యాన్ని కిమ్స్ హాస్పిటల్స్ చైర్మన్, మాజీ మంత్రి బొల్లినేని కృష్ణయ్య రాజీపడకుండా మంచి క్వాలిటీ తో సమర్పించడం పట్ల తెలుగుదేశం శ్రేణులు, జనసేన శ్రేణులు హర్షం వ్యక్తం చేస్తున్నాయి.

న్యూఢిల్లీలో సీనియర్ కాంగ్రెస్ నాయకురాలు, రాజ్యసభ సభ్యురాలు శ్రీమతి రేణుకా చౌదరి, విజయవాడలో భారతీయ జనతాపార్టీ ఎమ్మెల్సీ సోము వీర్రాజు, ఆంధ్రప్రదేశ్ పురపాలక శాఖామంత్రి పి. నారాయణ , తూర్పు గోదావరి జిల్లాలో ఆంధ్రప్రదేశ్ పర్యాటక శాఖ మంత్రి కందుల దుర్గేష్ , హైదరాబాద్ లో తెలంగాణ రెవిన్యూ ప్రిన్సిపల్ సెక్రటరీ , సీనియర్ ఐఏఎస్ ఆఫీసర్ శ్రీమతి శైలజ రామయ్యర్ తదితరులు ఈ అద్భుతగ్రంధం రచనా సంకలన కర్త , పురాణపండ శ్రీనివాస్ సృజనాత్మక ప్రతిభా సామర్ధ్యాలపై అభినందనలు వర్షించడం ప్రత్యేకంగానే పేర్కొనాలి.
ప్రముఖ పారిశ్రామికవేత్త బొల్లినేని కృష్ణయ్య ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వకార్యాలెన్నింటికో ఈ శ్రీమాలిక గ్రంధాన్ని నిస్వార్ధ యజ్ఞసేవగా అందించడాన్ని జనసేన శ్రేణులు, తెలుగుదేశం సీనియర్ నాయకులూ అభినందిస్తున్నారు.

.jpeg)